కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ విహంగ వీక్షణం..

CM KCR visits Kaleshwaram On13th February

కోటి ఎకరాలకు నీరందించే  లక్ష్యంతో   ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కలల ప్రాజెక్ట్ గా నిర్మించారు . సీఎం కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగమేఘాల మీద పనులు చేయించారు. ఇప్పుడు పనులు ఆశించిన మేర పూర్తయి మూడేళ్లల్లోనే ప్రాజెక్ట్ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఆ ప్రాజెక్ట్ ఫలాలు ఇప్పుడు తెలంగాణ అందుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం నుంచి హైదరాబాద్ దాక ఈ ప్రాజెక్ట్ నీళ్లు వెళ్లేలా సీఎం కేసీఆర్ ఇంజనీర్ల తో కలిసి చర్చించి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారు.
ఇప్పటి వరకు జరిగిన పనులు ఇక చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్ అధికారులకు ఇంజనీర్లకు దిశా నిర్దేశం చేశారు . ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించాలని భావించిన సీఎం కేసీఆర్ కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో  బస చేశారు. గురువారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు . తుపాకులగూడెం ఆనకట్టతో పాటు మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ ఆనకట్టను కూడా ఆయన పరిశీలించారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో సీఎం కేసీఆర్ విహంగ వీక్షణం చేశారు .

ఇక నిన్న  ప్రగతిభవన్లో ఈ ప్రాజెక్ట్ పై  సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు అధికారులతో  కాళేశ్వరం ప్రాజెక్టులలోకి అనుకున్న రీతిలో సాగునీరు చేరుకుంటున్నదని ఆయన వ్యాఖ్యానించారు . ఇప్పుడు మనం కట్టుకున్న బ్యారేజీలు నిండుకుండలా మారాయని రానున్న వానం కాలం నుంచి వరద నీటి ప్రవాహం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు . ప్రాణహిత ద్వారా లక్ష్మీ బారేజీ కి చేరుకునే వరద నీటిని ఎప్పటికప్పుడు ఎగువకు ఎత్తి పోసుకునే దిశగా అటునుంచి కాలువలకు మల్లించే దిశగా ఇరిగేషన్ శాఖ ఇప్పటినుంచే అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన  పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *