తప్పుడు ప్రచారం చేసేవారికే కరోనా

CM KCR WARNED SOCIAL MEDIA

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. నిన్న కరొనా మృతి కాదని, మృతి చెందిన వారిని టెస్ట్ చేస్తే కరొనా అని తేలిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రిస్క్ తో పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. కరోనా కేసుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, ఎక్కడా దాచిపెట్టడం లేదని  స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారికే ముందుగా కరోనా వస్తుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

గ్రామాల్లో పట్టణాల కంటే క్రమశిక్షణ పాటిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కరొనా సోకలేదు. మార్కెట్ రద్దీతో కొరొనా సోకే అవకాశం ఉంటుంది. అందుకే మార్కెట్లను మూసివేయాలని నిర్ణయించాం. రైతులెవరూ ఆందోళన చెందవద్దు. ఒక్క కిలో పోకుండా ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తది. కూపన్ లో ఉన్న తేదీలోనే రైతులు అధికారులను కలవాలి. నెలన్నర రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తారు. అమ్మే టైం లో పాస్ బుక్ తీసుకొని రైతులు రావాలి. ధాన్యం రైతులు చేతులతో కోస్తలేరు. హార్వెస్టర్ తో కొస్తున్నారు. తెలంగాణ లో 5వందలు అర్వేస్టార్ లు మాత్రమే ఉన్నాయి.

కరొనా నివారణకు లాక్ డౌన్ మాత్రమే. దీన్ని అమలు పై ఇండియాను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ కు పూర్తిగా సహకరించాలి. సౌత్ కొరియా లో ఒకే వ్యక్తి వల్ల 59వేల మందికి కరొనా సోకింది. కరొనా వెరీ డేంజరస్ వైరస్ జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరిస్తున్నారు. హోమ్ క్వరంటాయిన్ లో ఉన్న వారిని రోజుకు రెండు సార్లు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రజలందరూ ఇలాగే ఉంటే తక్కువ నష్టంతో బయటపడుతాం.

cm kcr corona updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *