రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

CM YS Jagan Sankranthi Greetings

సంక్రాంతి వచ్చేసింది. రైతన్నలు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. కొత్తపంట చేతికొచ్చిన సంతోషంలో పచ్చనైన తోరణాలతో అట పాటలతో గంగిరెద్దుల నాట్యాలతో హరిదాసుల ప్రవచనాలతో జరిగే ఈ తెలుగు వారి పండుగ రానే వచ్చింది. ఈ సందర్భంగా ఎక్కడెక్కడి తెలుగు వారంతా తమ తమ సొంత గ్రామాలకు వెళ్లి కుటుంబ సమేతంగా జరుపుకుంటున్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన రాష్ట్ర ప్రజలందరికి ట్విటర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని పేర్కొన్నారు ట్వీట్ చేశారు సీఎం జగన్. ఇక సంక్రాంతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కనులపండుగగా జరుపుకుంటారు. మూడు రోజులపాటు సాగే ఈ పండుగను ఎంతో సంప్రదాయంగా చేస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు.

CM YS Jagan Sankranthi Greetings,Andhra Pradesh CM YS Jagan,Occasion Of Sankranti,Makar Sankranti wishes, Convey Sankranti Wishes,Bhogi,Kanuma,Three Days Festival

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *