కొలంబో ఉగ్ర దాడుల్లో ఇద్దరు జేడీఎస్ కార్యకర్తలు మృతి

Colambo terrorist Attack 2 JDS Supporters Died

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రదాడులు బీభత్సం సృష్టించాయి. వందల మందిని ఉగ్రవాదం పొట్టనపెట్టుకుంది. మారణ హోమం సృష్టించింది. ఈస్టర్ పర్వదినాన పవిత్ర ప్రార్ధనా మందిరాలలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది . ఆదివారం ఏప్రిల్ 21, 2019 న ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాలేదు.

వారందరూ విహారయాత్ర కోసం కొలంబోకి వెళ్లారు. మిస్ అయిన ఏడుగురిలో హనుమతరాయప్ప, రంగప్ప చనిపోయినట్లు భారత రాజబార కార్యాలయం ప్రకటించింది. కర్నాటక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.కనిపించకుండా పోయినవారి సమాచారం కోసం కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ తో టచ్ లో ఉన్నానని కుమారస్వామి అన్నారు. శ్రీలంకలో జరిగిన వరస పేలుళ్లలో చనిపోయినవారిలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయులను గుర్తించినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *