ఇది ఎలాంటి కమిట్ మెంటో?

COMMITMENT MOVIE

ఇటీవల కాలంలో తెలుగు సినిమా సైతం కొత్త పోకడలు సృష్టిస్తోంది. బాహుబలి వంటి రాజుల బ్యాక్ గ్రౌండ్ సినిమాలే కాకుండా అర్జున్ రెడ్డి వంటి ఆడల్ట్ కంటెంట్ మూవీస్ తెలుగు తెరను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ఆడల్ట్ కంటెంట్ కే అనుగుణంగా ఉండటంతో అలాంటి సినిమాలు కోకొల్లుగా వచ్చి పడుతున్నాయి. తాజాగా లక్ష్మీకాంత్ చెన్నా అనే దర్శకుడు ఒకే ఒక్క పోస్టర్ తో మొత్తం అందరి దృష్టినీ ఆకర్షించాడు. అది ‘కమిట్ మెంట్’ అనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్. సమాజంలో జరుగుతున్న ఓ నిజం అని ట్యాగ్ లైన్ కూడా ఉంది. పేరు చూస్తేనే అర్థమైపోతోంది కదూ? ఇది ఏ జానర్ సినిమానో? పైగా పోస్టర్ చూస్తే పేరు చూడక్కర్లేదు. అంత సృజనాత్మకంగా దానిని డిజైన్ చేశారు.

ఓ బెడ్.. దానిపై రెండు పిల్లోస్, కిందకు సగం పడి ఉన్న దుప్పటి, అమ్మాయి, అబ్బాయి షూస్ తోపాటు బ్రా, పాంటీ వంటివి ఆ పోస్టర్ లో కనిపిస్తాయి. ఆ పోస్టర్ చూడగానే అక్కడ ఏం జరిగిందో అర్థమైపోతుంది. మీటూ ఉద్యమం కీలకంగా జరుగుతున్న ప్రస్తుతం సమయంలో దర్శకుడు అలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. సినిమా రంగంలోనే కాదు.. బయట ఎక్కడ చూసినా కమిట్ మెంట్ అనేది సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన లక్ష్మీకాంత్.. ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు బయట పెడతాడో చూడాలి.

TELUGU CINEMA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *