చెరువు కబ్జా పై ఓ సామాన్యుడి ట్వీట్

Spread the love

Common man tweet on Lake occupation… స్పందించిన కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు ఒక సామాన్యుడు షాకింగ్ ట్వీట్ చేశాడు . చెరువు కబ్జా జరుగుతుంది ట్వీట్ పెట్టారు. ఎలాంటి సమస్యకైనా ట్విట్టర్ వేదికగా సమాధానం చెప్పే కేటీఆర్ దీనికి ఎలా స్పందిస్తారు అని చాలా మంది ఆసక్తిగా చూసారు. కేటీఆర్ స్పందించిన తీరు నెటిజన్ లను ఫిదా చేసింది.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తన పనులన్నీ ఎంతో బాధ్యతాయుతంగా చేస్తున్న కేటీఆర్ తెలంగాణలో తన మార్క్ పాలన చూపించాలనుకుంటున్నారు. ఇక ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక ట్వీట్ చేస్తే చాలు వెంటనే నేనున్నా అంటూ సహాయ సహకారాలందించే కేటీఆర్ నెటిజన్ల అభిమానాన్ని చూరగొన్నారు. కేటీఆర్ స్పందించే తీరు చూసిన చాలా మంది ప్రభుత్వానికి నేరుగా చేప్పుకుందామనుకున్న అంశాలను, సమస్యలను ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేసి పెడుతూ ఉంటారు. చాలా వేగంగా స్పందించే కేటీఆర్ కు ఓ సామాన్యుడు చెరువు కబ్జా అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు
బోడి వెంకట్ అనే స్థానికుడు మేడ్చల్ జిల్లా కీసరలోని నగరం లోని చెరువు అన్నరాయిని, చెరువు కబ్జా అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.ఆయన కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్ లో “అయ్యా, మా గోడు వినిపించదా మీకు. మేము ఏమి చేయం.. మీడియాలో , పేపరులో రాయిస్తాం అంతే.. అని అనుకోవాలా చెప్పండి. ఇవ్వాళ ఎవ్వడో వచ్చి … ప్రభుత్వం నాకు చెరువులో 2 ఎకరాలు ఇచింది అంటూ చెరువులో పెద్ద పెద్ద లారీలో మట్టి తెచ్చి చెరువు పూడుస్తున్నాడు. దీనిపై స్పందించండి” అంటూ ప్రశ్నించాడు.

ఇక ఈ అంశంపై వెంటనే స్పందించిన కేటీఆర్.. మేడ్చల్ జిల్లా కలెక్టర్, హెచ్ఎండీఏ కు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ రీట్వీట్ చేశారు. అంతేకాకుండా చెరువు పాడైపోతుందని, కబ్జాకు గురవుతుందని గతంలోనే కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ఈ పనిచేయగలం అని మేడ్చల్ డీఐఓ తెలిపారు. నెలలు గడుస్తున్నా ఫలితం కనిపించడం లేదని.. చెరువు పాడైపోవడమే కాదు.. కబ్జా అవుతోందని స్థానికుడు చెప్పడంతో… కేటీఆర్ అధికారులను ఆదేశించారు.ఈ తరహా నిర్ణయాలతో కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *