ఏపీని చూసి నేర్చుకో

Spread the love

Compared TO Jagan KCR is more Energetic

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది . పక్క రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమని కెసిఆర్ కు హితబోధ చేయడం ప్రారంభమైంది. ఇది భవిష్యత్తులో కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామాలను తీసుకు వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒకపక్క నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డితో చాలా అనుభవం ఉన్న కేసీఆర్ ను పోలుస్తూ , అలాగే పాలన చేతకావటం లేదంటూ తిట్టిపోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు . ఏపీలో జగన్ పారదర్శక పాలన దిశగా అడుగులు వేస్తుంటే, అసలు పాలన విషయమే మరిచిపోయారు కెసిఆర్ పై విరుచుకు పడుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.

ఇటీవల మందకృష్ణ మాదిగ వైయస్ జగన్ కి కి తాబిచ్చి మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, దళితులకు క్యాబినెట్లో సముచిత స్థానం ఇచ్చారని, సమన్యాయం పాటించాలని పేర్కొంటూనే ఇక కెసిఆర్ జగన్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అతి తక్కువ కాలంలో మంచి పాలన సాగిస్తున్న జగన్ ను చూసి కెసిఆర్ నేర్చుకోవాలన్నారు. ఇక తాజాగా విజయశాంతి సైతం సీఎం కేసీఆర్ జగన్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. మహిళల పట్ల కేసీఆర్ కు చిన్నచూపు ఉంది కాబట్టే మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, కానీ జగన్ మంత్రివర్గంలో మహిళను డిప్యూటీ సీఎం చేయడంతో పాటుగా, అత్యంత కీలకమైన హోమ్ మినిస్టర్ గా కూడా మహిళకు అవకాశమిచ్చారని విజయశాంతి పేర్కొన్నారు. నిన్నగాక మొన్న పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ను చూసైనా కెసిఆర్ మారతారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా పక్క రాష్ట్ర పాలన చూసైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తున్నారు అంటూ మెచ్చుకున్న జీవన్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, తాము అందిస్తున్న పథకాలు దేశంలోనే గొప్ప పథకాలు అంటూ గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమైందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీని చూసైనా సీఎం కేసీఆర్ పాలన నేర్చుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం రెండు డీఎస్సీలో పూర్తి చేసిందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఆయన మండిపడ్డారు. విద్య పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులే ఎక్కువ ఉన్నారంటూ విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని తప్పుపట్టారు. ఖాళీగా ఉన్న 20వేల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *