రవిప్రకాశ్ కస్టడీ పై పూర్తయిన వాదనలు

Completed claims on Raviprakash custody

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆర్ధిక లావాదేవీల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అలంద మీడియా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 కోట్ల మేర సంస్థ సొమ్ము కాజేశారని ఆయన మీద కేసులు నమోదైన నేపధ్యంలో ఆయనను అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలుకు తరలించారు. ఇక ఆయనను పోలీసులు కస్టడీకి కోరుతున్నారు.  కస్టడీపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రవిప్రకాశ్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రూ. 18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై టీవీ9 యాజమాన్యం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించింది. అయితే, కేసుకు సంబంధించి రవిప్రకాశ్ ను విచారించాల్సి ఉందని, ఆయనను తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారా హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్డు ఈరోజు వాదనలను వింది. రేపు దీనిపై తీర్పును వెలువరించనుంది.
tags : ravi prakash, tv9 former ceo, alanda media, chanchalguda jail, custody, arguements, nampalli court

నన్ను గెలిపిస్తే నో ట్రాఫిక్ చలానాలు అంటున్న బీజేపీ అభ్యర్థి

హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓడించాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపు నిచ్చిన భట్టి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *