10 లక్షలు దాటిన కన్ఫర్మ్‌‌ టికెటి యాప్

Confirmtkt crosses 10 lakh bookings

బెంగుళూరు ఆధారితమైన ఆన్లైన్ టికెట్ డిస్కవరీ మరియు బుకింగ్ ఇంజిన్ కన్ఫర్మ్‌‌టికెటి తన పురోగమిస్తున్న విజయం కధనంలో ఒక ప్రధాన మైలురాయిని ఏర్పరుస్తూ ఒక సంవత్సరంలో 100 కోట్లకు సమానమైన వార్షికంగా 10 లక్షల బుకింగులను అందుకుంది. మొత్తం బుకింగులలో 15.591% మరియు 11.886% లను సాక్షాత్కరిస్తూ మహారాష్ట్ర మరియు ఢిల్లీలు వరుసగా కన్ఫర్మ్‌‌టికెటి యాప్ వినియోగంలో తొలి రెండు స్థానాలలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పశ్చిమబెంగాల్, కర్నాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో కూడా విస్తృతంగా బుకింగులు జరుగుతున్నాయి.

తొలుత కేవలం సమాచారాన్నందించే వేదికగా మాత్రమే సేవలను ప్రారంభించిన కన్ఫర్మ్‌‌టికెటి మార్చి 2018 లో టికెట్లను బుకింగ్ కూడా చేసుకోగలిగే సేవలను ప్రవేశపెట్టింది. దీనిని ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే 1 మిలియన్ల బుకింగులను అందుకోవడం కన్ఫర్మ్‌‌టికెటి ను మరింత ప్రాముఖ్యమైన యాప్‌‌గా రూపుదిద్దుకునేలా చేసింది. ఇప్పుడు 2019 నాటికి ఇది 4 మిలియన్ల బుకింగులను చేరుకోనుందని అంచనా. తన ఉద్దేశాలను గురించి మాట్లాడుతూ కన్ఫర్మ్‌‌టికెటి సహ వ్యవస్థాపకులు మరియు సిఇఒ దినేష్ కుమార్ కోతా ” 7 మిలియన్ల కంటే అధిక డౌన్లోడ్లను (ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్) లతో మరియు నెలవారీగా ప్లాట్‌‌ఫార్మ్‌‌లపై చురుకుగా ఉండే 3 మిలియన్ల యూజర్లను కలిగి ఉండటాన్ని గమనిస్తున్న మేము గత రెండు సంవత్సరాలలో అద్భుతమైన వృద్ధి సంఖలను చూస్తున్నాము. సుమారు రూ.4.5 కోట్ల నికర ఆదాయంతో మేము రూ 100 కోట్ల అమ్మకాలను సాధించాము (ఆడిట్ జరిగి ఫైలింగ్‌‌లు ముగిసిన తర్వాత అంతిమ లెక్కలు వెల్లడిచేయబడతాయి). ఈ సంఖ్యలు తెలియజేస్తున్నట్లుగానే, కన్ఫర్మ్‌‌టికెటి యూజర్ల విశ్వాసాన్ని చూరగొని పరిశ్రమలో తన విజయాన్ని పదిలం చేసుకుంది. ఇటీవలి సాధన సంవత్సరాలుగా మా బ్రాండ్ సాధించిన నమ్మకానికి ఒక తార్కాఅణంగా నిలుస్తుంది.” అని అన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ” ఇప్పటి వరకూ 2019 చిరస్మరణీయంగా నిలిచిపోయింది మరియు మాకు భవిష్యత్తులో భారీ ప్రణాళికలు కూడా ఉన్నాయి. మేము ఈ టికెటి బుకింగ్ అనుభవాన్ని మరిత సులభతరంగానూ జంజాటం లేనిది గానూ చేయాలని ప్రయత్నిస్తున్నాము. దీనిని తొలిసారిగా ఉపయోగిస్తున్న వారైనా, టైర్ II నగరాలకు చెందిన ఇంగ్లీషు రాని వారైనా రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ మేము మా సేవలను అందించబోతున్నాం. మేము 2020 నాటికి ఊజర్ బేస్‌‌లో బలమైన వృద్ధితో పాటు టికెట్ల బుకింగుల ద్వారా రూ.400 కోట్ల అమ్మకాలను మరియు రూ. 18-20 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నాము. వచ్చే ఏడాదికల్లా, రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి కన్ఫర్మ్‌‌టికెటి భారతదేశంలో అత్యంత వాంఛిత ప్లాట్‌‌ఫార్మ్‌‌గా అవతరించనుంది.” అని అన్నారు.

online ticket booking easy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *