రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ సీక్రెట్ టాస్క్

Congress High Command Secret task for Reddy

తెలంగాణాలో చాప కింద నీరులా టీపీసీసీ చీఫ్ కోసం ఎవరి రూట్ లో వారు ప్రయత్నం చేస్తున్నారు.ఇక టీపీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది . తెలంగాణా గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కుదేలు అయిన నేపథ్యంలో పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడు కోసం హైకమాండ్ అన్వేషణ ప్రారంభించింది అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొనే నాయకుడు ఎవరు అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిపిన హై కమాండ్ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ధీటుగా ఎదుర్కొంటారని పార్టీని బలోపేతం చేస్తారని భావించింది.అయితే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అవకాశమిస్తే ఊరుకోబోమని పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను కాదని రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వటం ఏంటి అని గట్టిగానే ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.ఇక విహెచ్ బాహాటంగా రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డాడు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖాయమనే వార్తలు రావటంతో రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ తో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కూడా కలిసి వచ్చారు.
అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా తమ నిరసన గళాన్ని వినిపించారు. దీనితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయంలో కొంచెం వెనక్కి తగ్గింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో మొదటినుంచి ఐక్యత లేదు . ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని సీనియర్లు హెచ్చరించటంతో కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక దీంతో రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించాలంటే ముందుగా పార్టీలోని నాయకులు అందర్నీ ఏక తాటి మీదికి తీసుకురావాలని హై కమాండ్ ఆదేశాలు జారీ చేసిందని సమాచారం.
పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించి, వాళ్ళ పూర్తి అంగీకారంతో వస్తే నీకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే అధికారం అందుంటుంది. ఆలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది. నీ విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవటం నీ బాధ్యత. కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి అంగీకారంతో ఈ విషయంపై ఒక క్లారిటీ తో రావాలని రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. మరి రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పనిని ఏ మేరకు సమర్ధవంతంగా నిర్వహిస్తారో వేచి చూడాలి .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *