అంతా రేవంత్ ఇష్టమేనా

congress leaders about revanth reddy

కాంగ్రెస్ పార్టీ నేతల తీరు  ఏం మారలేదు.  ఆధిపత్య పోరు ఇంకా అలాగే ఉంది. తాజాగా ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా మరో మారు కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత వివాదాలు బయటకు వచ్చాయి. తమకు ఎవరికీ చెప్పకుండా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారని, అలా ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తన ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కొందరు నాయకులు . ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం పార్టీ నాయకులకు ఏ విషయం చెప్పలేదని మండిపడ్డారు.  రేవంత్  రెడ్డి వ్యవహారశైలిపై  సీఎల్పీ కార్యాలయంలో  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క,  సంపత్ కుమార్, కోదండ రెడ్డి  తదితరులు భేటీ అయ్యారు.  ఎవరినీ సంప్రదించకుండా  రేవంత్ రెడ్డి  ఇష్టారాజ్యంగా  ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని ,  ఇక ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనివారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ప్రగతిభవన్ ముట్టడి ఏమో కానీ.. ఈ ఘటన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య మరోసారి అగ్గిరాజేసిందని తాజా పరిణామాలు చెప్తున్నాయి . ప్రగతి భవన్ ముట్టడి వారి మధ్య ఉన్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. పార్టీలో సీనియర్ నేతలెవరినీ సంప్రదించకుండా ప్రగతిభవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారంటూ పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి ప్రకటించారని నేతలు ప్రశ్నిస్తున్నారు.

tags : congress party, pragathi bhavan protest, revanth reddy, uttam kumar reddy, v. hanumantha rao,

అర్చకులకు శుభవార్త చెప్పిన వైసీపీ ప్రభుత్వం

బోటులో మృత దేహాలు ఎన్ని ఉన్నాయంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *