ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా కాంగ్రెస్ నేతలు

Congress leaders supporting RTC

తెలంగాణా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 10 వ రోజు కొనసాగుతుంది. అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. కార్మికులకు అండగా సమ్మెలో పాల్గొంటున్నాయి. సీఎం కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని హితవు చెప్తున్నాయి. అయినా సరే ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన కురిసిన చందంగానే ఉంది. ఇక ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు తొలగించింది ప్రతిపక్షాలా? అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని గతంలో సీఎం కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులు అమ్ముతామనడం ఎక్కడి న్యాయమని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలు దురదృష్టకరమని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు తాను అండగా ఉంటానన్నారు. సీఎం కేసీఆర్‌ మానవతాదృక్పథంతో ఆలోచించాలన్నారు. కార్మికుల డిమాండ్లను కేసీఆర్‌ వెంటనే నెరవేర్చాలన్నారు. కేసీఆర్‌తో రవాణామంత్రి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని.. లేదంటే మంత్రి పువ్వాడ అజయ్‌ ఇంటిని ముట్టడిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్‌ మొండి వైఖరి వీడాలని హితవు పలికారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమ్మెను అణగదొక్కాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ నేతలకు ఆర్టీసీ కార్మికులు అమ్ముడు పోయారని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరం అని వీహెచ్ పేర్కొన్నారు.

tags : tsrtc , rtc strike, cm kcr, jagga reddy, v, hanumantharao , bhatti vikramarka

సీఎం జగన్ తో లంచ్ చేసిన చిరంజీవి దంపతులు

అప్పుడు  చంద్రబాబునే  బెదిరించా అన్న ఎర్రబెల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *