‘లక్ష’ ఇళ్లేవి..?

Congress MLA Batti visited double bedroom houses

గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపిస్తామని అసెంబ్లీలోని చెప్పిన మంత్రి వాటిని జీహెచ్ఎంసీలోనే చూపించగలరా? అని ప్రతిపక్షం, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చాలెంజ్ విసిరారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ళ్లన చూపి టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, త్వరలో గ్రేటర్ ఎన్నికల్లో వీటిని చూపించి ప్రభుత్వం లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలన గ్రేటర్ ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లను చూపించలేక సిటీ శివారులోని ఇళ్లను చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. మొత్తం ఇళ్లను చూపించమని అడిగే ‘జాబితా ఇస్తాం చూసుకోండి‘ అంటూ అధికార పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీ సాక్షిగా డబుల్ ఇళ్లపై ఇరుపక్షాల మధ్య మొదలైన వేడి మరింత రాజుకుంది. రెండోరోజు శుక్రవారం కూడా ఇళ్ల పరిశీలన సవాల్ జరిగింది. చెప్పింది ఒకటి, చూపిందని మరోకటి ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఆరోపించారు. పొంతనలేని మాటలు చెప్తుందని ప్రతిపక్షం తమ పర్యటనను ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *