Congress mla jaggareddy fire on Ts government
ట్రాఫిక్ నిబంధనల పేరుతో పోలీసులు ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తారని, ఇందుకోసమే చలాన్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆటోలు, ద్విచక్ర వాహనదారులు, ఫోర్ విలర్ల యజమానులకు రూ. వేల్లలో డబ్బు వసూలు చేస్తున్నారని, ఇష్టానుసారంగా ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారని, దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతుకు ఐదు వేలు ఇచ్చి, అదే రైతు కొడుకు చేత అంతకుమించి డబ్బులు వసూలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అడ్డగోలు చలాన్ల సమస్యను శాసనసభలో అడిగేందుకు ప్రయత్నిస్తుంటే, సమయం దొరకడం లేదని, అందుకే మీడియా ముందుకు వచ్చానన్నారు. ఆటోవాలలు ఆరు నెలలు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో సగం సంపాదన చలాన్లకే చెల్లిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.