Congress MLA jaggareddy fires on Ts Government
ఒకవైపు వరదలతో హైదరాబాద్ నగరం కొట్టుకుపోతుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆస్తుల నమోదుకు ఆసక్తి చూపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. వరద బాధితులకు ఎలాగైతే నష్టపరిహారం అందించారో, అలాగే పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వెంటనే సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే రాష్రంలో ప్రభుత్వం ఉందా? సీఎం, సీఎస్ లు ఉన్నారా? అనే అనుమానం వస్తుందన్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం అవసరమా? లేక ప్రజల ఆస్తుల ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యమా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మొక్కుబడిగా రూ. 550 కోట్లు విడుదల చేసిందని, ఆర్థిక మంత్రి వరదలపై సమీక్షకుండా దుబ్బాక ఎన్నికలో నిమగ్నమయ్యాడని మండిపడ్డారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో అన్ని కలుపుకొని ఇళ్లకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.