Congress mla’s fire on kcr government
రాష్ర్ట ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించుకుంటోందని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఆరోపించింది. సీఎల్సీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని, కార్పొరేషన్ ద్వారా తీసుకునే రుణాలను 90 శాతం 200 శాతానికి పెంచుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో రాష్ర్ట ప్రజలపై అప్పుల భారం పడుతుందన్నారు. కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు.
గతంలో వీఆర్వో, తహసీల్దార్లు బాగా పనిచేస్తున్నారని మెచ్చుకున్న కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం ఎందుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తిపై అవాస్తవాలను ప్రచారం చేసిందని, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు పోతున్నాడని, ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే ప్రజా మద్దతుతో కేసీఆర్ కు బుద్ది చెప్తామన్నారు.