సీబీఐకూ… కోవిడ్ అంటుకుందా?

Congress MP DK Suresh tested Covid19 positive

కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం నేషనల్ ఇన్విసిగేషన్ అధికారులు ఆయన నివాసంపై దాడులు చేశాయి. అవినీతి నిగ్గు తేల్చేందుకు సీబీఐ పలు సోదాలు చేసింది. అనంతరం ఆయనను ప్రశ్నించింది. అయితే సీబీఐ దాడులు చేసిన తర్వాత డీకే సురేశ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. దాంతో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సీబీఐ దాడుల సమయంలో ఆయన అనుచరులు, మీడియా వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్ అయినవారందరికీ కరోనా సోకవచ్చుననే అనుమానాలు వస్తున్నాయి. డీకే సురేశ్ కు పాజిటివ్ అని తేలడంతో అటు మీడియా, ఇటు సీబీఐ అధికారులు, పలువురు కాంగ్రెస్ నాయకులు కరోనా టెస్టులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *