సోనీ కంపెనీక్ షాక్ ఇచ్చిన కన్జూమర్ కోర్టు

Spread the love

Consumer Court Shock for Sony Company

ప్రముఖ టీవీ విక్రయ సంస్థ సోనీకి జిల్లా కన్జూమర్ కోర్టు షాక్ ఇచ్చింది. కస్టమర్ కి డ్యామేజ్ అయిన టీవీ అమ్ముతారా అని సీరియస్ అయ్యింది. డ్యామేజ్ అయిన టీవీని అమ్మడమే కాకుండా మానసికంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుడికి వెంటనే రూ 3లక్షల 30వేలు చెల్లించాలని సోని సంస్థ, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ని ఆదేశించింది. టీవీ కొనుగోలు కోసం చెల్లించిన 1.3లక్షలు వెనక్కి ఇవ్వడంతో పాటు నష్టపరిహారం కింద రూ 2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
రాజశ్రీ అనే వ్యక్తి.. పారడైజ్ సర్కిల్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో 55 ఇంచ్ సోనీ టీవీని కొనుగోలు చేశారు. 2017లో అక్టోబర్ 13న లక్ష 29వేల 991 రూపాయలు చెల్లించి టీవీ కొన్నారు. తన తల్లి కోసం ఆయన ఆ టీవీ కొన్నారు. టీవీని ఇంట్లోని గోడకు ఇన్ స్టాల్ చేసే సమయంలో అందులో లోపం గుర్తించారు. టీవీ స్క్రీన్ లో లోపాలు ఉన్నాయి. ఈ విషయాన్ని వారు వెంటనే సోనీ ఇండియా టెక్నిషియన్లకు ఫిర్యాదు చేశారు.2017 డిసెంబర్ 18న ఓ టెక్నిషియన్ రాజశ్రీ ఇంటికి వచ్చాడు. ప్యానల్ మార్చి ఇస్తామని చెప్పాడు. అయితే అందుకు రాజశ్రీ నిరాకరించారు. డ్యామేజ్ అయిన టీవీని తనకు అమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీవీని రీప్లేస్ చెయ్యాలని, కొత్తది ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షలు పోసి టీవీ కొంటే.. డ్యామేజ్ అయిన టీవీ ఇస్తారా అని మండిపడ్డారు. అయితే సోనీ సంస్థ అందుకు నిరాకరించింది. టీవీలో పెద్ద లోపం ఏమీ లేదని, జస్ట్ ప్యానెల్ మారిస్తే సరిపోతుందని సోనీ టెక్నిషియన్లు వాదించారు. దీనికి రాజశ్రీ అంగీకరించలేదు. ఆయన కన్జూమర్ కోర్టుని ఆశ్రయించారు. తనకు జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. సోనీ టీవీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు విచారించిన కోర్టు.. వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సోనీ సంస్థకి షాక్ ఇచ్చింది. కస్టమర్ కి వెంటనే రూ.3లక్షలు చెల్లించాలని ఆదేశించింది. టీవీ కొనేందుకు చెల్లించిన డబ్బుతో పాటు అదనంగా నష్ట పరిహారం కింద 2లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పింది. అలాగే ఫిర్యాదు చేయడానికి రాజశ్రీకి రూ.10వేలు ఖర్చు అయ్యాయి. ఆ మొత్తాన్ని కూడా చెల్లించాలని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *