కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్

COOLPAD COOL 3 PLUS

కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్, డ్యూడ్రాప్ డిస్ప్లే, హీలియో ఎ22, డ్యూయల్ సెక్యూరిటీ తో ఆవిష్కరించబడింది; దీని ధర రూ. 5999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 5.7”డ్యూడ్రాప్ స్క్రీన్, 3 జిబి ర్యామ్, 13ఎంపి వెనకవైపు కెమెరా మరియు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి

భారతదేశ యువత స్మార్ట్ ఫోన్స్ నుండి కేవలం పనితీరే కాకుండా ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు. మిల్లెన్నియల్స్, ఎక్కువగా, డబ్బులు విలువతో పాటుగా, అసామాన్యమైన డిజైన్, గ్రౌండ్ బ్రేకింగ్ రూపంకోసం చూస్తున్నారు. ఈ డిమాండ్స్ ను అర్థం చేసుకుని, కూల్ ప్యాడ్, యులోంగ్ గ్రూప్ ద్వారా స్థాపించబడిన, ఒక ప్రముఖ ప్రపంచవ్యాప్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్, క్యూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంటి6761(హీలియో ఎ22), క్వాడ్ కోర్ 2.0 GHz క్లాక్ స్పీడ్ తో, 3 జిబి ర్యామ్ తో మరియు ఆశ్చర్యకరమైన 5.7” డ్యూడ్రాప్ స్క్రీన్ తో, భారతీయ మార్కెట్ లో నమ్మశక్యంకాని ధరలతో ఆవిష్కరించబడింది. మిలిన్నెయిల్స్ ను దృష్టిలో ఉంచుకుని, కూల్ ప్యాడ్ కూల్ ప్లస్ 3, రెండు కొత్త యంగ్ మరియు బోల్డ్ రంగులలో, అంటే ఓషియన్ బ్లూ మరియు చెర్రీ బ్లాక్ తో సహా, లబిస్తోంది. కూల్ 3 ప్లస్ రెండు శక్తివంతమైన వేరియంట్స్ లో అంటే 2జిబి ర్యామ్/16జిబి స్టోరేజి మరియు 3జిబి ర్యామ్/32జిబి స్టోరేజిలలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర వరుసగా రూ. 5,999/- మరియు రూ 6,499/- తో, 2 జూలై నుండి అమెజాన్.ఇన్ లో బుకింక్ కోసం అందుబాటులో ఉంటుంది.

నూతన ఆవిష్కరణ గురించి మాట్లాడుతూ, కూల్ ప్యాడ్ ఇండియా సిఇఓ, ఫిషర్ యువాన్ ఇలా అన్నారు, “దేశంలోని బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ యొక్క నిర్వచనాన్నే మార్చగల కూల్ ప్యాడ్ 3 ప్లస్ ను ఆవిష్కరించడానికి మాకు ఎంతో రోమాంఛితంగా ఉంది. స్మార్ట్ ఫోన్ రూపొందించే సమయంలో, మేము యువ మిలిన్నెయిల్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి అంచనాలను దాటే ఉత్పత్తులను రూపొందించాలని మేము అనుకుంటాము. భారతీయ స్మార్ట్ ఫోన్ పరిశ్రమ, సృజనాత్మకత మూస లో ఉంది మరియు మా ఈ ఇటీవలి ఉత్పాదన ఆవిష్కరణతో, మేము, భారతీయ వినియోగదారులకు, ఉత్తమ సాంకేతికతను మరియు స్మార్ట్ ఫోన్ తరాన్ని అప్ గ్రేడ్ చేయుటలో తోడ్పడుతున్నాము. దీనికి పొడిగింపుగా, భారతదేశంలో మేము 800+ పేటెంట్స్ తో, ఇదే పేరు క్రింద 5జి-సిద్ధమైన స్మార్ట్ ఫోన్స్ ను త్వరలోనే ఆవిష్కరిస్తున్నాము. ఈ స్మార్ట్ ఫోన్ భారతీయులకు బాగా నచ్చుతుందని మరియు కూల్ ప్యాడ్ తన లక్ష్యమైన అత్యంత ప్రేమించబడే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా అవుతుందని మరియు 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా 3 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ను చేరుకుంటాయని మేము విశ్వసిస్తున్నాము.”

స్మార్ట్ ఫోన్ కోసం, మార్కెటింగ్ వ్యూహంపై వ్యాఖ్యానిస్తూ, పంకజ్ ఉపాధ్యాయ్, ఆన్ లైన్ బిజినెస్ హెడ్, కూల్ ప్యాడ్ ఇండియా, ఇలా అన్నారు, “ ఈ కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్, భారతీయ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ రూపురేఖలు మార్చడానికి సిద్ధమైంది. అందుచేత, ఈ ఫోన్ ను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చేయడం మనకు ఎంతైనా అవసరం. భారతీయ ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వేదిక, అమెజాన్.ఇన్ ద్వారా ఈ ఫోన్ ను ఆవిష్కరించడం మనకు అత్యున్నతంగా పెంపొందించబడిన దృష్టికోణాన్ని అందిస్తుంది. ఈ కూల్ 3 ప్లస్ అమెజాన్ ఇండియాలో 2 జూన్ నుండి అందుబాటులో ఉంటుంది మరియుఈ వెబ్ సైట్ యొక్క ఎంతోమందిని చేరుకునే నేపథ్యంలో మరియు దీని కస్టమర్ బేస్ తో పాటుగా మన అతి చవకైన ధరలతో విక్రయాలు దూసుకుపోతాయని మేము విశ్వసిస్తున్నాము.”

యంగ్ మరియు సృజనాత్మక బ్రాండ్ అయిన కూల్ ప్యాడ్, ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ భారతీయ మార్కెట్ లో తన విస్తృత శ్రేణి స్మార్ట్ ఫోన్స్ అయిన కూల్ ప్యాడ్ కూల్, కూల్ ప్యాడ్ మెగా మరియు కూల్ ప్యాడ్ నోట్ సిరీస్ తో, ఇదివరకే తన ఉనికిని చాటింది. కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ ఆవిష్కరణతో, ఇది తన ప్రధాన మరియు నిరంతర ప్రయోగ సాంకేతికతతో తన వినియోగదారులకు స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రీమియం శ్రేణికిని అందించడంతో, సృజనాత్మక బ్రాండ్ గా తన ఉనికిని ఇంకా ముందుకు చాటుతుంది. కూల్ ప్యాడ్ దృష్టి కోణం, మేక్ ఇన్ ఇండియా తో అనుసంధామై, కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ యొక్క 100% ను భారతదేశ తయారీని ముందుకు నడుపుతోంది.

ఈ కూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్ ఒక బహుళ పనికారి, ఇది ఇలాంటి ధరలో గల ఏ ఇతర ఫోన్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. కూల్ ప్యాడ్ కూల్ 3 ను ఈ విభాగంలో ప్రత్యేకంగా నిలబెట్టేదేమిటంటే, దీని వాస్తవమైన ప్రీమియం అంశాలయిన, అత్యంత చవకైన పోటీ ధరలలో 5.7” డ్యూడ్రాప్ స్క్రీన్ వంటి అంశాలు. 8.2మిమీ మందముతో, ఇది చాలా తేలికైనది మరియు పోర్టబుల్ పరికరం. ఇంకా, దీని అడ్వాన్స్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రయాణిస్తున్న వారికి 12% వేగవంతమైన అన్ లాకింగ్ అందిస్తుంది. చివరగా, ఈ ఫోన్, యుఎస్‌బి ఓటిజి (ఆన్-ద-గో) అంశం కలిగి ఉంటుంది, ఇది టెక్-సావ్వీ యూజర్స్, తమ పరికారాన్ని ఒక కీ బోర్డ్, కార్డ్ రీడర్, యు-డిస్క్ మరియు మరెన్నింటితో కనెక్ట్ చేసుకోగలరు. స్మార్ట్ ఫోన్ ద్వారా అందించబడే సౌకర్యాన్ని పెంపొందిస్తూ, ఈ బ్రాండ్ లో, 5.0 బ్లూటూత్, వై-ఫై, జిపిఎస్, గ్రావిటీ సెన్సర్, లైట్ సెన్సర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సర్ వంటి అత్యున్నత పనితీరు అనుబంధ అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి. క్యూల్ ప్యాడ్ కూల్ 3 ప్లస్, న్యూ ఢిల్లీలో జూన్ 26, 2019 న ఒక గొప్ప వేడుకలో ఆవిష్కరించబడింది. ఈ ఆవిష్కరణ వేడుక, కూల్ ప్యాడ్ నాయకత్వ బృందం సమక్షంలో జరిగింది మరియు ఉత్పాదనను వాస్తవంగా చూసి అనుభవించుటకు అతిథుల కోసం ఒక డెమో జోన్ కూడా ఏర్పాటు చేయబడింది.

కూల్‌ప్యాడ్ గురించి
2003 ప్రారంభించబడిన కూల్‌ప్యాడ్ ఇంకా యవ్వనంగానే ఉంది, ఇది సృజనాత్మక ప్రముఖ ప్రపంచవ్యాప్త స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా ఎదిగి, తన ఆర్ & డి మరియు తయారీ యొక్క పోటీతత్వ ప్రయోజనాలని వినియోగించుకుంటూ అన్ని కోణాలలో పురోగమిస్తోంది. దీని మాతృక కంపెనీ యులోంగ్ కూల్ ప్యాడ్, చైనాలోని షెంజెన్ లో 1993 లో ఏర్పాటు చేయబడింది. ఈ కంపెనీ, హాంక్ కాంగ్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ యొక్క ప్రధాన బోర్డ్ లో 2004 లో (కోడ్: 2369) లిస్ట్ చేయబడింది. కూల్ ప్యాడ్ యొక్క విక్రయాల ఆదాయం 67% చక్ర వార్షిక రేటుతో అభివృద్ధి చెందింది. “డ్యూయల్-మోడ్ మరియు డ్యూయల్-స్టాండ్ బై టెక్నాలజీ” లతో సహా సృజనాత్మకత సాంకేతికతలో 13,000 కు పైగా పేటెంట్స్ కలిగిన, కూల్ ప్యాడ్ కు చైనాలో టాప్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ ప్రదానం చేయబడింది. ట్రెండ్‌ఫోర్స్ అనేది కూల్య్ ప్యాడ్ ను 2013 సంవత్సరం యొక్క రెండవ త్రైమాసంలో, 6వ అతిపెద్ద ప్రపంచవ్యాత స్మార్ట్ ఫోన్ ఓఇఎంగా ర్యాంక్ ఇచ్చింది, ఇది గట్టి పోటీదారులైన ఎల్‌జి మరియు నోకియా వంటి కంపెనీలను అధిగమించింది మరియు మొట్టమొదటి సారి చైనా ఫార్చూన్ 500 లో కూడా లిస్ట్ చేయబడింది.

మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి www.coolpadindia.com

మాగురించి మీరు తెలుసుకోవలసిన వివరాలు:

• భారతదేశంలో అత్యంత చవకైన ఫింగర్ ప్రింట్ అనుకూల స్మార్ట్ ఫోన్ యొక్క మొట్టమొదటి ఆవిష్కరణ
• ప్రపంచంలోనే మొట్టమొదటి సిడిఎంఎ/జిఎస్‌ఎం డ్యూయల్-మోడ్, డ్యూయల్-స్టాండ్ బై స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించబడింది
• వినియోగదారు అనుకూల ఆర్&డి కే మా అత్యంత ప్రాధాన్యత
• 2017 తొలినాళ్ళలో 5జి అభివృద్ధి కోసం, ఆర్&డి లో పెట్టుబడి పెట్టిన కంపెనీలలో ఒకటి
• కూల్ ప్యాడ్ కు 5జి పేరు క్రింద 800+ కంటే ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి
• భారతదేశమంతటా 400+ సర్వీస్ కేంద్రాలు.

Related posts:

టీ వర్క్స్ కొత్త వెంటిలేటర్
రైల్వే స్టేషన్ లో ఉచిత వైఫై బంద్
దేశవ్యాప్తంగా ఫ్రీ వైఫై సేవలు నిలిపివేత
10 వేల కోట్లను చెల్లించిన ఎయిర్ టెల్
5జీ  చీపెస్ట్  ఫోన్లు...జియో సంచలనం
 రిపబ్లిక్ డే సేల్స్ ..ఆఫర్లతో అమెజాన్,ఫ్లిప్ కార్ట్
నిరుద్యోగులకు పండుగ లాంటి వార్త చెప్పిన అమెజాన్
విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీపట్టిన నాసా
విక్రమ్ పై ఆశలు అడియాశలేనా?
ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్
ఎకో ల్యాబ్ ను ఆవిష్క‌రించిన డ్రూమ్
ఈ లాప్ టాప్ ను మడతపెట్టేయొచ్చు
కాంగ్రెస్ లో చేరిన బాలీవుడ్ తార ఊర్మిళ
కోట్లాది యూజర్ల పాస్ వర్డ్స్ టెక్స్ట్ రూపంలో దాచిన ఫేస్ బుక్
ఎన్టీఆర్‌..బిగ్ బాస్ 3 చేయ‌డం లేదు.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *