కరోనా డెత్ రేటు తగ్గుతోంది

Corona Death Rates Decreased

కరోనా మరణాల డెత్ రేట్ తగ్గుతోందా అంటే ఔననే అంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరోనా కూడా తగ్గాలని కోరుకుంటున్నానని తెలిపారు. పక్కన ఇంటిలో కరోనా పాజిటివ్ ఉంటే ఎం భయపడకండి. అది మీకు సొకదన్నారు. బాధ్యత లేని వాళ్ళు కన్ఫ్యూజన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా కూడా ప్రజలకు ధైర్యం కలిగించాలని విజ్ఞప్తి  చేస్తున్నారు. తెలంగాణలో 6600 పరీక్షల కెపాసిటీ కి చేరుకున్నామని.. ప్రైవేట్ తో కలిపి ప్రతి రోజూ 10 వేల పరీక్షలు చేసే సామర్థ్యం తెలంగాణలో ఉందన్నారు. అత్యంత అధునాతన సౌకర్యాలతో గచ్చిబౌలి అసిపత్రి సిద్ధం అయ్యిందన్నారు. పీజీ కాలేజీ చండీగఢ్ ఎలా డాక్టర్స్ అందిస్తుందో.. టిమ్స్ పీజీ కాలేజీ కూడా అలాగే డాక్టర్లను అందిస్తుందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కి కేరాఫ్ అడ్రెస్స్ ఇది కావాలని సీఎం కేసిఆర్ ఆలోచన అన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని హంగులు టిమ్స్ లో ఉన్నాయన్నారు. ఇంత అత్యాధునికమై న ఆసుపత్రి ఇంకా ఎక్కడా లేదన్నారు. టీమ్స్ లో 1224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా వెయ్యి బెడ్స్ కి ఆక్సిజన్.. యాభై బెడ్స్ కి వెంటిలేటర్ అందుబాటులో ఉన్నాయి. పదిహేను ఫ్లోర్లు సిద్ధం అయ్యాయని తెలిపారు. క్యాంటీన్ ఇక్కడే ఉంటుంది. పేషంట్లు ఇక్కడే భోజనం సిద్ధం చేస్తామన్నారు. రెండు రోజుల్లో స్టాఫ్ రిక్రూట్ అయిపోతుందని తెలిపారు. తెలంగాణలో రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించామన్నారు. ఆరోగ్య రంగంలో అనేక రిఫార్మ్స్ తెచ్చామని అన్నారు. బురద చల్లడం మానుకోవాలని హితువు పలికారు. గాంధీ లో వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దని ఆయన కోరారు. సోషల్ మీడియాలో కామెంట్లు పేషెంట్లకు నష్టం చేస్తాయన్నారు. కరోనా పేషెంట్లకు తోడుగా హాస్పిటల్ లో ఎవరూ ఉండరు. అన్నీ తామై మా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారిని అవమాన పరచడం తగదన్నారు. జిమ్మేదారీ లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు వాటిని నమ్మకూడదని కోరారు. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని, హాస్పిటల్ లో చేరాలని సూచించారు.

 

Telangana Covid Cases Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *