బడ్జెట్ సమావేశాలకు కరోనా ఎఫెక్ట్ ..

Corona Effect in TS Assembly No Shake Hand only Namaska

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యేలు కరచాలనం మానేసి నమస్కారాలు పెట్టటం ఆసక్తికర చర్చకు కారణం అయ్యాయి. ఒక పక్క ప్రజలను కరోనా భయం నుండి బయటపడేలా చూడాల్సిన ప్రజా ప్రతినిధులే కరోనా భయంతో నో షేక్ హ్యాండ్ … ఓన్లీ నమస్తే అంటే అసెంబ్లీలో నేతలకు సైతం కరోనా వైరస్ భయం ఉందని తెలుస్తుంది. ఇక తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు  ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు  వచ్చిన నేపధ్యంలో తెలంగాణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి  వంటి కొందరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు  నిరాకరించి నమస్తే పెట్టటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే కరచాలనం వద్దు.. నమస్కారాలు ముద్దు అని సూచించారు. మంత్రి కేటీఆర్‌ సహా..ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు.. తమ సహచరులకు నమస్కారం అంటూ చేతులు జోడించి ముందుకెళ్లారు. ఇక ఈ పంధా కొత్తగా అనిపించినా చాలా సంస్కారవంతంగా అనిపిస్తుంది అని కొందు అంటుంటే , కరోనా కు భయపడుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్  చేతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది అని భావిస్తున్న తరుణంలో చేతులు కలపకుండా నవ్వుతూ  నమస్కారం చెయ్యటం గమనార్హం .

Corona Effect in TS Assembly No Shake Hand only Namaska,Telangana assembly session,  budget session, budget 2020-2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *