Corona Effect on Mps
కోవిడ్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. ఇలా అందరిపై పడగ విప్పుతోంది. తాజాగా వివిధ పార్టీలకు చెందిన 25 ఎంపీలకు కారోనా వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరి ఎంపీలకు కూడా కరోనా సోకింది.
చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చాడు. పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు.