కేసీఆర్ కే ఎసరు పెట్టిన కరోనా..?

4
CM KCR Order to GHMC
CM KCR Order to GHMC

corona on pragathi bhavan

కరోనా.. ఈ పేరు వింటే ప్రపంచం అంతా వణికిపోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన ఎన్నో వైరస్ లను చూసింది ప్రపంచం. కానీ ఇన్ని నెలల పాటు ఇంకా ఏ వ్యాక్సినూ దొరక్కుండా ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న మొదటి వైరస్ ఇదే కావొచ్చు అనేంతగా అది వ్యాపిస్తోంది. ప్రస్తుతం దీని నిర్మూలనకు వ్యాక్సిన్ లేదు. కానీ వ్యాపించకుండా నివారణ జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కొన్ని తీసుకున్నట్టుగా నటించాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం ఒకటి. కొన్ని రోజుల క్రితం టెస్ట్ లే చేయకుండా కేస్ లు లేవని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ హైకోర్ట్ అక్షింతలు వేసిన తర్వాత పరీక్షలు పెంచింది. దీంతో ఇక్కడా భారీ స్థాయిలో పాజిటివ్ కేస్ లు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం కరోనాకు సంబంధించిన ఓ మీటింగ్ లో కెసీఆర్ తమను విమర్శిస్తోన్న వారికి కరోనా రావాలని శపిస్తున్నా అన్నాడు. కానీ ముందుగా ఆయన పార్టీలోనే పాజిటివ్ కేస్ లు మొదలయ్యాయి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో మొదలై మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనూహ్యంగా పాజిటివ్ కేస్ లు పెరుగుతున్నాయి. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. ఎటు నుంచి వస్తుందో తెలియని ఈ మహమ్మారి ఎంతోమందిని కాటు వేస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఈ నేపథ్యంలో మేం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అందరికంటే ‘నెంబర్ వన్’అని గొప్పలు పోతోన్న ప్రభుత్వానికి చెంప పెట్టులా ఏకంగా సీఎం కేసీఆర్ ఇలాఖా అయిన ప్రగతి భవన్ లోనే కరోనా పాజటివ్ కేస్ లు నమోదు కావడం విశేషం. అక్కడ ఏకంగా 20 మందికి పైగానే సిబ్బందికి పాజిటివ్ వచ్చిందని సమాచారం. దీంతో భయపడిపోయిన కేసీఆర్ తన సొంత ఊరైన గజ్వేల్ ఫామ్ హౌస్ కు మకాం మారుస్తున్నాడు. ఏదేమైనా కీలకంగా పనిచేస్తోన్న  ప్రభుత్వ శాఖల్లోని చాలామంది ఉద్యోగులు కోవిడ్ -19 బారిన పడ్డారు. ఇక ప్రగతి భవన్ వరకూ అది వ్యాపించడం వెనక ప్రభుత్వ వైఫల్యం స్పష్టం అవుతోందనే చెప్పాలి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా గాంధీకే అన్న కేసీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం ఖరీదైన కార్పోరేట్ హాస్పిటల్ కు పంపించడం కూడా విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో తన ప్రభుత్వ పనితీరును ప్రగతి భవన్ కేస్ లు ఎండగట్టాయనే చెప్పాలి.

general news