మహిళా కరోనా పేషెంట్ ను కూడా వదల్లేదు

7
corona patient raped
corona patient raped

corona patient raped

మనిషిలో మృగం బయటకు వస్తే కాలం గురించి కూడా ఆలోచించడు. అయితే ఈ సంఘటన గురించి తెలిస్తే మాత్రం వాడిని మృగం అనేమాటను దాటి మాట్లాడాలేమో అని తప్పక అనిపిస్తుంది. అసలే కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. పాజిటివ్ వచ్చిన పేషెంట్ తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం కూడా కనిపించడం లేదు. అలాంటిది కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్ లో ఉన్న ఓ మహిళ(40యేళ్లు) పై అదే క్వారంటైన్ లో  ఉన్న మరో పాజిటివ్ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి నీచుడిని ఏం చేసినా పాపం లేదని ప్రతి ఒక్కరూ అనుకునే ఈ సంఘటన ముంబైలో జరిగింది. న్యూ ముంబైలోని ఓ హాస్పిటల్ లో కరోనా పాజిటివ్ తో నలభైయేళ్ల మహిళ క్వారంటైన్ లో ఉంది. అదే వార్డ్ లో పాతికేళ్ల కుర్రాడికి కూడా కరోనా పాజిటివ్ తో క్వారంటైన్ లో ఉంచారు. మామూలుగా కరోనా మన ఊరిలో ఒక్కరికి వచ్చిందంటేనే వణికిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకున్నారు జనం.

అలాంటిది ఆ మదమెక్కిన మృగం మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. గత గురువారం రాత్రి ఆ మహిళపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత పారిపోయాడు కూడా. ఆ మహిళ మరుసటి రోజు పోలీస్ లకు కంప్లైంట్ చేసింది. అప్పటికే వాడు పారిపోవడంతో పోలీస్ లు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కరోనా కాలంలో కూడా కక్కుర్తి పడ్డ ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇదే టైమ్ లో హాస్పిటల్ లో ఉంటోన్న మహిళా పేషెంట్స్  భద్రత గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు ఆ వెధవను తీసుకువచ్చి హాస్పిటల్ లోనే ఏ ఫెసిలిటీస్ లేకుండా చనిపోయేంత వరకూ ఉంచాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

crime news