పాపం మూడేళ్ల బాబుకు కరోనా

corona to three years boy

పాపం.. మూడేళ్ల బుడతడు. పాలు కూడా సరిగ్గా తాగడం తెలియదు. అమ్మ చాటున పిల్లవాడు. బులిబులి అడుగులు వేసుకుంటూ, తల్లిదండ్రులతో ఆడుకునే బుజ్జిగాడు. ప్రపంచం అంటే ఏమిటో తెలియని చిన్నారికి కరోనా వైరస్ సోకింది. అవును, మూడేళ్ల బాబు కరోనా బారిన పడ్డారు. ఎలాగో తెలుసా? సౌదీ అరేబియా నుంచి భాగ్యనగరానికి తీసుకొచ్చిన ఆ చిన్నారికి కరోనా సోకింది. పాపం, ఈ విషయం తెలియగానే తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక తల బాదుకుంటున్నారు. కరోనా మహమ్మారికి తన బాబే దొరికాడా అంటూ ఏడుస్తున్నారు. ఇంకో కేసులో 43 ఏండ్ల మహిళకు కరోనా సోకింది. ఆమె కానీ ఆమె కుటుంబంలో కానీ ఎప్పుడూ విదేశాలకు వెళ్లిన చరిత్ర కూడా లేదు. మరి, అలాంటి మహిళలకు కరోనా సోకడం షాక్ కలిగించే అంశమని చెప్పొచ్చు.

మరి, ప్రైమరీ కాంటాక్టు ద్వారా హైదరాబాదీయులకు కరోనా సోకడం కొంత భయాందోళనకు గురించే అంశమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా హైదరాబాదీయులు ఇంట్లో నుంచి బయటికి రాకూడదని, లేకపోతే ప్రైమరీ కాంటాక్టు ద్వారా కరోనా సోకే ప్రమాదముందని చెప్పొచ్చు.

telangana latest corona cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *