భారత్ లో కరోనా మరణం ?

Coronavirus Updates In India

ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్ భారత్ లోనూ అలజడి రేపుతోంది. మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే.   చైనా నుంచి వచ్చిన ముగ్గురు కేరళ వ్యక్తుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. చికిత్స అందించిన తర్వాత వారంతా కోలుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అయితే వీరిలో ఒకరు చనిపోయారన్న వార్త కలకలం రేపుతోంది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి పుదుకొట్టైకి వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి పేరు శక్తికుమార్. ఫిబ్రవరి 4న చైనా నుంచి వచ్చాడు. తీవ్ర అనారోగ్యంతో మధురై ఆసుపత్రిలో చేరాడు. అక్కడి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న చనిపోయాడు. చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులకే అనారోగ్యానికి గురికావడం, చికిత్స పొందుతూ చనిపోవడం అనుమానాలకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగానే అతడి చనిపోయి ఉంటాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చైనా నుంచి 115మంది తమిళులు పుదుకొట్టైకి వచ్చారు. అనారోగ్యంతో శక్తికుమార్ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక వైద్య బృందాలు పుదుకొట్టై గ్రామానికి తరలివెళ్లాయి.  కరోనా వైరస్‌ చైనాతో పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్‌ కారణంగా ఇప్పటికే 1873 మంది ప్రాణాలు కోల్పోయారు. 72వేల 332 మందికి కరోనా సోకింది. వీరిలో 11వేల 795 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా వైరస్ 29 దేశాలకు విస్తరించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాడేందుకు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ముందుకొచ్చింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్ధమైంది. ఇక భారత్ లోనూ కరోనా మరణం సంభవించటంతో టెన్షన్ పట్టుకుంది.

Coronavirus Updates In India,india, corona virus, coronavirusindia, coronaviruschina, pudukottai, chennai, tamilnadu, shakthi kumar , death

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *