కరోనాపై అవగాహన లేని కార్పొరేటర్?

Corporators Doesn’t Care Corona?

బొడుప్పల్ లో కరోనా వైరస్ పై ప్రపంచమంతా యుద్ధం చేస్తుంటే బొడుప్పల్ కార్పొరేటర్లు మాత్రం దానిని గాలికి వదిలేస్తున్నారు. బొడుప్పల్ మునిసిపాలిటీ పరిధిలో కార్పొరేటర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపేందుకు కొంతమంది కార్పొరేటర్ లు గుంపుగా వెళ్లి ఆయనకు శాలువా కప్పి మాస్కులు లేకుండా కరచాలనం చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించి ఎక్కడి వాళ్ళను అక్కడ కట్టడి చేసి రోడ్ల పైకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కార్పొరేటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చిన సంగతి మరచి పోయారు. పాపం కేసీఆర్ సారు, కేటీఆర్ సారు ఎంత చెప్పినా వీరికి మాత్రం అర్థం కావడం లేదు.

కరోనా వ్యాప్తిని నిరోధించాల్సిన వీరు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. అసలు పండగలు, పబ్బాలు మరిచిపోయిన ప్రస్తుత తరుణంలో ఇలా గుంపులుగా వెళ్లడం బాధ్యతారాహిత్యమేనని స్థానిక ప్రజలు అంటున్నారు. కరోనా పట్ల కార్పొరేటర్లకే అవగాహన లేకపోతే, ఇక సామాన్య ప్రజలు రోడ్ల మీదికి రాకుండా ఉంటారా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా కార్పొరేటర్లకు కరోనా వ్యాధి తీవ్రత గురించి, దాని వల్ల ప్రపంచమంతా జరుగుతున్న నష్టాన్ని వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పొరపాటున ఏ ఒక్కరికీ కరోనా అంటుకున్నా తెలంగాణ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి, ప్రజాప్రతినిధులు బహిరంగంగా తిరిగేటప్పుడు కాస్త ముందుజాగ్రత్తలను పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కోరారు. ఆ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి మసులుకుంటే మనుగడ ఉంటుంది.

municipal corporators covid 19 awareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *