ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్

Spread the love

Count Down Election Schedule Release

ఎప్పుడెప్పుడా అని అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠ తో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఎలక్షన్స్ ఏర్పాట్లపై ఈసీ అన్ని రాష్ట్రాలతో మాట్లాడింది. 6 నుంచి 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మార్చి 9.. లేదా మార్చి 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడదుల కానుందని సమాచారం.
ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాలన్నీ ముగింపు దశకు చేరాయి. మోడీ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, రాష్ట్రాల పర్యటనలు తుది దశకు చేరుకున్నాయి. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్‌‌సభ ఎన్నికలను 6 నుంచి 7 దశల్లో 2 నెలల్లో పూర్తి చేసేలా ఈసీ కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్, అంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ప్రణాళిక రూపొందిస్తోంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై మాత్రం సందిగ్దత కొనసాగుతోంది.ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆలస్యంపై ఈసీ తీరుని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈసీ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 5నే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో ఏప్రిల్‌ 30న పోలింగ్‌ జరగ్గా ఏపీలో మే7న పోలింగ్‌ జరిగింది. ఈసారి 5వ తేదీ దాటినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పుడే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ఈసీ మాత్రం ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించలేదు.
షెడ్యూల్ విడుదలపై వస్తున్న ఆరోపణలను ఈసీ కొట్టిపారేసింది. షెడ్యూల్ విడుదలలో ఎలాంటి జాప్యం లేదని చెప్పింది. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *