డీఎంకే అధినేత స్టాలిన్ కు కోర్టు వార్నింగ్ ..రీజన్ ఇదే

Court ruling for Stalin, the DMK supremo

తమిళనాడులో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో స్టాలిన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తచేసిన హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ మాట్లాడకుండా ఉంటేనే అతనికి బెయిల్ కొనసాగుతుందనీ..లేదంటే మాటలు జారితే బెయిల్ ను రద్దు చేస్తామని స్పష్టం చేస్తు వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో కొడనాడు ఎస్టేట్ హత్యల మిస్టరీపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
తమిళనాడు దివంగత సీఎం జయలలితకు కొడనాడులో ఎస్టేట్ ఉంది. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో జయలలిత ఇక్కడి నుంచి కూడా పాలన సాగించేవారు. ఈ క్రమంలో ఆమె మరణం తరువాత కొడనాడు ఎస్టేట్ లో 2018 ఏప్రిల్ 24న దొంగతనం జరిగిన సందర్భంలో దుండగులు సెక్యూరిటీ గార్డును కిరాతకంగా హత్య చేశారు.ఈ హత్యను పళనిస్వామి(ప్రస్తుత సీఎం) చేయించారని స్టాలిన్ ఆరోపించారు. దీంతో సీఎం పళనిస్వామి దీన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం స్టాలిన్ కొడనాడు ఎస్టేట్ పై వ్యాఖ్యలు చేయరాదనీ..ఈ కేసు విషయంలో ఆయనకు లభించిన బెయిన్ ను రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *