జీహెచ్ఎంసీ కార్మికులకు వాక్సిన్

53
Covid Vaccine To All Ghmc Employees
Covid Vaccine To All Ghmc Employees

జీహెచ్ఎంసి లోని పారిశుధ్య కార్మికుల నుండి మొదలు కమీషనర్ వరకు 100 శాతం అధికారులు, సిబ్బందికి కరోనా వాక్సిన్ ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 15 వ తేదీ లోగా మొత్తం అధికారులు సిబ్బందికి వాక్సిన్ వేయడం పూర్తి చేయాలని జోనల్ కమీషనర్లను జీహెచ్ఎంసి ఆదేశించారు. వాక్షినేషన్ నిర్వహణపై జోనల్ కమీషనర్ లతో కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్లలో వాక్షినేషన్ ఇప్పించేవిధంగా ఏర్పాట్లు చేయాలని జోనల్ కమీషనర్ లకు ఆదేశించారు.

ప్రతిరోజూ వాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రధాన కార్యాలయానికి పంపడంతో పాటు వాక్షినేషన్ వివరాలను కోవిద్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. అన్ని స్థాయిలోనూ దాదాపు 30 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ జీహెచ్ఎంసి లో ఉన్నారు. కరోనా కట్టడిలో భాగంగా 15 వ తేదీ తర్వాత ప్రతిఒక్కరు అధికారి, సిబ్బంది విధిగా వాక్సిన్ వేసుకొనే కార్యాలయానికి రావాలి. కార్యాలయాలకు వచ్చే సందర్శకులు కూడా వాక్సిన్ వేసుకొని రావాలని చైతన్య పర్చాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కోవిద్ నిబంధనలను కచ్చితంగా పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలి. కరోనా కట్టడిలో మరోసారి చురుకైన పాత్ర వహించాలని కోరారు.

Ghmc Latest Updates