మాట మార్చిన సీపీఐ నారాయణ

CPI NARAYANA CHANGED HIS VERSION

దిశ ఎన్ కౌంటర్ని మొదట్లో స్వాగతించిన సీపీఐ నారాయణ ఆ తర్వాత మాట మార్చారు. తమ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, దిశ ఎన్ కౌంటర్ తప్పు అని అభివర్ణించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే జాతీయ కార్యవర్గానికి క్షమాపణ చెప్పారని తెలిపారు. సీపీఐ పార్టీ బూటకపు ఎన్ కౌంటర్లకు ఎప్పుడూ వ్యతిరేకమని, అదే క్రమంలో తమ పార్టీ కూడా ఈ ఎన్ కౌంటర్ ను పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పుకొచ్చారు. సీపీఐ జాతీయ మహాసభల్లో తాను క్షమాపణ తెలియజేశానని అన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా ఇలాంటి బోగస్ ఎన్ కౌంటర్లను వ్యతిరేకిస్తామన్నారు. భవిష్యత్తులో బూటకపు ఎన్ కౌంటర్లు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

DISHA ENCOUNTER UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *