ప‌టాకుల నిషేధంపై సుప్రీంకు..

CRACKERS DEALERS FILED CASE

హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు లో లంచ్ పిటీషన్ దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకులను నింపామని, పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటీషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్ ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు కోర్టు పిటీషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్య లు చేసుకుంటారన్న పిటీషనర్.. అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వెళ్లాల‌ని పిటీష‌న్ వేశారు. దీనిపై నేడు పిటీషన్ పై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు.

TELANGANA LEGAL CASES LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *