ఇజ్రాయేల్ నుంచి క్రెడాయ్ కోరిందేమిటి?

Spread the love

CREDAI NATCON 2019 HIGHLIGHTS

క్రెడాయ్‌ నిర్వహించిన న్యాట్‌కాన్‌ 2019లో భారతదేశంలోని 200 నగరాల నుంచి దాదాపు 12 వేల మంది డెవలపర్లు పాల్గొన్నారు. వీరిలో దక్షిణం నుంచి వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉన్నది. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు రెండు వందలకు పైగా డెవలపర్లు ఈ సదస్సులో పాల్గొనడం విశేషం. నిర్మాణ రంగం కష్టకాలంలో ఉన్నదని.. కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఆదుకోవాలని క్రెడాయ్‌ టెల్‌ అవీవ్‌ వేదికగా కోరింది. లేకపోతే, ఈ రంగంపై ఆధారపడ్డ 150కి పైగా పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయని అభిప్రాయపడింది. ఉక్కు పరిశ్రమలు వంటివి వారంలో రెండు, మూడు రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయని తెలియజేసింది. భారత జీడీపీకి సుమారు 6.7 శాతం నిర్మాణ రంగం నుంచే వస్తున్నదని, పైగా వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించేది నిర్మాణ రంగమేనని గుర్తు చేసింది. కాబట్టి, ఈ రంగం పురోగతి చెందేలా కేంద్రం పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలని సూచించింది. ఇన్‌సాల్వెన్సీ చట్టానికి కొత్తరూపమివ్వాలని కోరింది. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల కొరతను పరిష్కరించే విధంగా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం నిర్మాణ రంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదని, ఇదే సమయంలో కేంద్రం ఆదుకోవాలని కోరింది. మొదటిసారి ఇల్లు కొనుక్కునేవారికి ఏడున్నర శాతం వడ్డీకే గృహరుణాన్ని అందజేసేలా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది.

NATCON 2019 @ TELAVIV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *