బీజేపీ 8 కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్

BJP 8 crores of money clean Cheat For BJP

.. కేసు నమోదు కానట్టేనా

లోక్సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న బీజేపీకి చెందిన ఎనిమిది కోట్ల రూపాయలకు ఐటీ క్లీన్ చిట్ ఇచ్చింది . అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.

ఇటీవల ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన రూ. 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు టాస్క్ఫోర్స్ పోలీసులు. ఈ నగదును బిజెపి ఖాతా నుండి లక్ష్మణ్ పేరు మీద విత్ డ్రా చేసినట్లుగా నారాయణగూడలోని ఇండియన్‌ బ్యాంకు నుంచి ఈ నగదును పోలీసులకు సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో ఈ నగదు ను పట్టుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.

అయితే బ్యాంక్ అధికారులు ఇంత నగదును ఒకేసారి ఇవ్వడంపై ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకంటే నగదు లావాదేవీలను బ్యాంకులు ప్రోత్సహించడం లేదు. పొరపాటున ఎవరైనా ఎక్కువ నగదు విత్ డ్రా చెయ్యాలి అనుకుంటే లక్ష రూల్స్ చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకులు, ఒక రాజకీయ పార్టీ అడిగిన తడవునే ఒకేసారిగా 8 కోట్ల నగదు ఇవ్వడంపై సర్వత్రా పెద్ద దుమారమే రేపుతోంది.
అయితే బిజెపి విత్ డ్రా చేసిన ఎనిమిది కోట్ల రూపాయలు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గెలుపు కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబ్బులు పంచడానికి అని టిఆర్ఎస్ ఆరోపించింది. అయితే అలాంటిదేమీ లేదని, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలు సమావేశాలు ఖర్చులు చెల్లించడం కోసం విత్ డ్రా చేశామని బిజెపి రాష్ట్ర అధినాయకత్వం చెబుతోంది. ఏదేమైనప్పటికీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో బిజెపి వంటి జాతీయ పార్టీ కోట్ల రూపాయల నగదు విత్ డ్రా చేయడం సంచలనంగా మారింది. ఈ నగదు విషయంలో ఇప్పటివరకు కేసు నమోదు కాని నేపథ్యంలో, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *