క్షణ క్షణం.. భయం భయం..

5
Crowd of Monkies comes to Siddapoor village
Crowd of Monkies comes to Siddapoor village

Crowd of Monkies Attack to Siddapoor village

సిద్దాపూర్ లో కోతుల దండయాత్ర

భయపెడుతూ.. దాడిచేస్తూ..

భయం గుప్పిట్లో గ్రామస్తులు

‘వర్షాలు పడాలె… కోతులు వాపస్ పోవాలె’…. సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో అన్న మాటలివి. వర్షాలు బాగా పడితే కోతులు అడవి బాట పడతాయని కేసీఆర్ ఉద్దేశం. ఆకాశం చిల్లలు పడేలా వర్షం కురుస్తున్నా… ఆ గ్రామాన్ని మాత్రం కోతులు విడిచిపెట్టడం లేదు. చిన్న పిల్లలను ఆడుకోనివ్వడం లేదు. ఆడోళ్లను బయట అడుగు పెట్టనివ్వడం లేదు. ముసలొళ్లు కనిపిస్తే ఇక ఎగబడుడె. పగలు, రాత్రి అనే తేడా లేకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ ఊరి గ్రామస్తులు చేసేదేమీ లేక కోతులతో ఫైట్ చేస్తున్నారు. ఈ కోతుల బెడద తప్పెదెప్పుడో.. మా బాధలు తీరేదెప్పుడోనని కాలం వెళ్లదీస్తున్నారు.

గుంపుగుంపులుగా…

సిద్ధాపూర్…. నాగార్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం. రెండు వేల కుటుంబాలు ఉంటాయి. నల్లమలకు దగ్గరలో ఉంటుంది. దట్టమైన అడవులు ఉన్నా… వర్షాలు బాగా పడుతున్నా… కోతుల గుంపు మాత్రం ఊరిని విడిచిపెట్టడం లేదు. కనీసం వందల సంఖ్యలో కోతులుటాయి. ఒక్కొక్క ఇల్లు.. ఒక్కొ కోతిది అన్నట్టుగా ఇంటిపై నిఘా వేసి ఉంటాయి. ఊరివాళ్లు ఏమాత్రం అదమరిచినా ఇక అంతే సంగతులు. ఇంట్లో దొరికే పాలు, బ్రెడ్డు, పండ్లు, చివరకు నోటికాడ ముద్దను కూడా విడిచి పెట్టవు. ఇంట్లోకి దూరి భయబ్రాంతులకు గురిచేస్తాయి. భయపెడితే దాడి చేస్తాయి.

Crowd of Monkies comes to Siddapoor village
Crowd of Monkies comes to Siddapoor village

వెంటపడి దాడిచేస్తాయి

ఊళ్లో వాళ్లంతా వ్యవసాయంపై ఆధారపడే బతికేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఏ పొద్దునో పొలానికి వెళ్తే రాత్రికానీ తిరిగి రారు. ఇదే అదునుగా భావిస్తున్న కోతులు కిటికీలు, ఇంటిపైన గునాల ద్వారా ఇంట్లోకి చొరబడి పప్పు, కూరగాయలు, బియ్యాన్ని ఖాళీ చేస్తాయి. ఇల్లును చిందరవందరగా చేస్తాయి. కోతుల సమస్యను తప్పించుకునేందుకు కుటుంబంలో ఎవరో ఒకరు కాపలా కాస్తారు. అయినా దాడి చేస్తుంటాయి. చిన్న పిల్లలు ఏ బిస్కటో, చాక్లెటో కొనుక్కోవడానికి వెళ్తే.. వెంటపడి మరి లాక్కెళ్తాయి. చేతిలోని వస్తువు ఇవ్వకుంటే దాడి చేస్తాయి. దాంతో పెద్దలు పిల్లల వెంట కావాల్సినవి ఇప్పిస్తున్నారు.

 

కూరగాయల సాగుకు దూరం

Monkies crowd at siddpoor village

ఊరి అంటే ఇంటి ముందు ఖాళీ జాగా ఉంటుంది. చాలామంది ఇంటి ముందు జామ, రేగి పండ్ల లాంటి చెట్లు పెంచుతుంటారు. ఇంకొందరు సొరకాయ, దొసకాయ లాంటివి కూరగాయల సాగు చేస్తుంటారు. అయితే కోతుల భయానికి వీటన్నింటికి దూరంగా ఉంటున్నారు. ఎవరి ఇంటి ముందు జామ చెట్టు కనిపిస్తే ఇక అంతే.. పండ్లను కొరికి చెట్లను నాశనం చేస్తాయి. ఎంతోకష్టపడి పెంచిన చెట్లు, కూరగాయల సాగు కోతుల పాలు అవుతుండటంతో చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. కొందరు సింటిమెంట్ గా భావించి కోతులను కొట్టడం లేదు. ఇంకొందరు ఊర అవతలకు కోతులను తరిమినా మళ్లీ ఊరిపై దాడి చేస్తున్నాయి. ‘ఊళ్లో వాళ్ల బాధ చూడలేక నేను, నా ఫ్రెండ్స్ కోతులకు గుంపు ఊరవతలకు తరిమినం. అయినా మళ్లీ వస్తున్నాయి. కేవలం కోతుల కోసమే ఇంటికి కాపాలాగా ఉండాల్సి వస్తోంది. కిరాణ షాపుకు వెళ్లి ఏదైనా తెచ్చుకుంటే.. వెంట పడి దాడి చేస్తాయి. కోతుల సమస్య ఇప్పట్లో తీరేట్లేదు’ అని ఊరి యువకుడు బొడ్డుపల్లి ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా మండలాధికారులు, నాయకులు స్పందించి కోతుల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

– బాలు జాజాల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here