CSK team dhoni
ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కథ దాదాపుగా ముగిసినట్టే. ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడంటే మూడే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక పాయింట్ల పట్టికల్లో చివరి స్థానంలో ఉంది. భారీ అంచనాల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఎన్నడూ లేనంత ఫేలవమైన ఆటతీరుతో అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డిండ్‌లో బలమైన జట్టుగా పేరొందిన సీఎస్కే.. ఎందుకు పనికిరాని జట్టుగా ముద్ర పడిపోయింది. కొన్ని మ్యాచ్‌ల్లో వాట్సన్, డుప్లెసిస్ మెరిసినప్పటికీ.. కీలకమైన మ్యాచ్‌ల్లో చేతులెత్తేడం టీం విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. ఇక మిడిల్ ఆర్డర్ కూడా అంతంతే రాణిస్తోంది.
అభిమానులు ఎక్కువగా ధోని ఆటతీరుపై మండిపడుతున్నారు. ఆ మధ్య ఓ యువకుడు ధోని ఆటను మెరుగుపరుచుకోకుంటే ధోని కూతురిపై అత్యాచారం చేస్తానన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తన బ్యాటింగ్ తో భారీ స్కోర్లు చేస్తాడనుకున్న అభిమాన ఆటగాడు జిడ్డు బ్యాటింగ్ చేస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. ఇక ఐపీఎల్ నుంచి తప్పుకో అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ ఐపీఎల్ లో ధోని కథ ముగిసినట్టే అభిమానులు చర్చించుకుంటున్నారు.