జగన్ వేధింపుల వల్ల నాన్న ఆత్మహత్య

Daddy Expired Due to Ys Jagan Harassment

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధప్రదేశ్ ప్రభుత్వం వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఈ విషయాన్ని పేర్కొన్నారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్ లోని  నివాసం కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలుత అది హత్య అని ఆతర్వాత ఆత్మహత్యగా పోస్టు మార్టంలో తేలింది. దీంతో, మాజీ స్పీకర్ పార్థీవ దేహాన్ని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి నరసరావుపేటకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన విషయం తెలిసిందే. అయితే, కోడెల మరణించిన తర్వాత ఆయన కూతురు విజయలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పొలిటికల్ రివేంజ్ కోసమే తన తండ్రితో పాటు తన అన్నపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది.

Kodela SivaPrasad Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *