DARBAR REVIEW
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి..
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మ్యూజిక్: అనిరుధ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సూపర్ స్టార్ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం దర్బార్ . క్రియేటివ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ శెట్టి విలన్ గా నటించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రజిని పోలీస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరి దర్బార్ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు గురువారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సినిమాకు ప్లస్ ఏంటి , మైనస్ ఏంటి? మొత్తానికి సినిమా టాక్ ఏంటన్న ఆసక్తికర విషయాలను చూద్దాం…
కథ: ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. ముంబై కమిషనర్ గా ఉండే ఆదిత్య అరుణాచలం ఉన్నట్టుండి తన బాధ్యతను మరిచి వింతగా ప్రవర్తిస్తుంటాడు. తప్పు చేస్తే చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ముంబైలో డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ఆదిత్య అరుణాచలం కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. దీంతో ఆదిత్య పూర్తిగా మారిపోతాడు. అప్పటివారిగా ఆదిత్య చాలా బాధ్యతగా ఉండే ఆదిత్య తనకు ఎదురైన సవాళ్ల కారణంగా వింతైన పోలీస్ ఆఫీసర్ గా ప్రవర్తిస్తూ గుండాలకు వణుకు పుట్టిస్తుంటాడు. మరి ఆదిత్య అరుణాచలంకు ఎదురైన సవాళ్లేంటి? కోల్పోయినదేంటి? అనేది తెలియాలంటే దర్బార్ సినిమా పూర్తిగా చూడాల్సిందే…
ఇక చాలా కాలం తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. తన పెర్ఫార్మన్స్ తో దర్బార్ సినిమాని ముందుకు నడిపించాడు.ఈ సినిమాలో రజినీ స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ నే కాక సామాన్య ప్రేక్షకులను కూడా కట్టి పడేస్తాయి. మ్యాడ్ కాప్ గా రజినీకాంత్ నటన చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నయనతార లుక్స్ తో అదరగొట్టింది. రజిని సరసన నయన్ పరఫార్మెన్స్ అద్భుతంగ చేసింది ఇక ఈ సినిమాలో నివేద థామస్ కు కీ రోల్ అనే చెప్పాలి. పాత్ర చిన్నదే అయినా మంచి పాత్ర పడింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత మంచి పాత్ర నివేదది, ఇక ఈ సినిమాలో విలన్ గా సునీల్ శెట్టి అదరగొట్టాడు. తనదైన శైలిలో రజినీతో ధీటుగా నటించాడు.
సాంకేతిక నిపుణులు: ఈ సినిమాకు హైలెట్ ఏంటంటే..సినిమాటోగ్రఫీ. ప్రతి సీన్ లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కనపడుతుంది. ఒక్క సెకన్ కూడా బోర్ అనేది కొట్టకుండా రేసీ స్క్రీన్‌ప్లేతో అలరించారట దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఇక రజినీకాంత్ అయితే తన పవర్ఫుల్ యాక్షన్‌తో కట్టిపడేశారట. వింటేజ్ రజినీని చూశామని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా రిచ్ గా ప్రజెంట్ చేశారు. ఇక సినిమా చూస్తుంటే ఎక్కడ కూడా డబ్బుకు వెనకడలేదనిపిస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే…అనిరుద్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నా… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మెప్పించాడు.
విశ్లేషణ: 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్. ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది. నేడు విడుదల కావడంతో ఇప్పుడు ట్విట్టర్లో పలువురు మంచి రేటింగ్ ఇస్తున్నారు.. తమిళంలో దర్బార్ రజిని ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుంది. తెలుగులో కూడా రజిని ఈసారి పర్వాలేదు అనిపించేలా ఉన్నాడు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఉంది.