దాసరి కొడుకు తారక ప్రభు మిస్సింగ్ మిస్టరీ

Spread the love

Dasari Son Tarak Prabhu missing Mistery

దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు పెద్ద కొడుకు దాసరి తారక ప్రభు కనిపించడం లేదంటూ, ఆయన మామ నార్ల సురేంద్ర ప్రసాద్ జూబ్లీ‌హిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేసారు. దీంతో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూన్ 9వ తేదీ జూబ్లీ‌హిల్స్ రోడ్ నంబర్-46లోని ఆఫీసులో పనులు చూసుకున్న ప్రభు, తర్వాత వాచ్‌మెన్‌కు చెప్పి, ఆటోలో బయటకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భార్య పద్మావతి ఫోన్ చేసినా స్పందించలేదు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా ప్రభు ఎంజీబీఎస్‌లో చిత్తూరు బస్ ఎక్కినట్టు తెలిసింది.ఆటో డ్రైవర్ ఫోన్ నుండే ప్రభు బస్ టికెట్ బుక్ చేసుకున్నాడని విచారణలో వెల్లడైంది. చిత్తూరులో ఉన్న మరో భార్య వద్దకు ప్రభు వెళ్లినట్టు తెలుస్తుంది. విచారణ నిమిత్తం ఒక పోలీస్ టీమ్ చిత్తూరు వెళ్లింది.

గత కొన్నేళ్లుగా దాసరి నారాయణ రావు కుటుంబంలో పలు వివాదాలు రాజుకుంటున్నాయి. దాసరి మరణించిన తర్వాత ఆ వివాదాలు మరింత విజృంభించాయి. ఆస్తి పంపకాల నేపథ్యంలో దాసరి పెద్ద కొడుకు దాసరి ప్రభుకి, ఆయన భార్య సుశీలకి మధ్య కొన్ని వివాదాలు తలెత్తడం జరిగింది.ప్రభు భార్య సుశీల దాసరి నారాయణ రావు ఆస్తి పంపకాల్లో తమకు న్యాయం జరగలేదని అప్పట్లో పెద్ద హంగామా చేసింది. ఈ విషయంలో పెద్దమనిషిగా ఉన్న నటుడు మంచు మోహన్ బాబుపై కూడా సంచలన ఆరోపణలు చేయడం చర్చినీయాంశం అయింది. అయితే ఆ తర్వాత మెల్లగా సద్దుమణిగిన ఈ వ్యవహారం తాజాగా దాసరి ప్రభు అదృశ్యం కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది.

ఈ నెల 9 వ తేదీన ఇంటినుంచి బయటికి వెళ్లిన దాసరి ప్రభు ఇప్పటి వరకూ జడ లేడు. ఆయనకు సంబందించిన కమ్యూనికేషన్ సాధనాలు కూడా పనిచేయడం లేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. దీంతో ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.దాసరి ప్రభు కనిపించక పోవడంపై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు దాసరి ప్రభు మిస్సింగ్ పై విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.దాసరి ప్రభు ఇలా అదృశ్యం కావడం ఇప్పుడే కాదు.. గతంలో కూడా జరిగింది. 2008లో కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయిన ఆయన తిరిగి వచ్చి తన భార్య సుశీలే తనను కిడ్నాప్ చేయించిందని ఆరోపించాడు. దాసరి ప్రభు, సుశీల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఆయన అదృశ్యం వెనుక కుటుంబ పరమైన కలహాలే కారణాలుగా ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *