భారత జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది

DECREASING THE POPULATION IN INDIA

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఈ విషయంలో మొదటి స్థానంలో ఉన్న చైనాను త్వరలోనే అధిగమిస్తుందన్న అంచనాలు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించాయి. అయితే జనాభాను తగ్గించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఫలితం దక్కింది. భారత్‌లో తొలిసారిగా జనాభా పెరుగుదల రేటు తగ్గిందని ఐక్యరాజ్య సమితి అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ దేశాల్లో జనాభా పెరుగుదలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఏటా అధ్యయనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పాపులేషన్ ఫండ్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2019 పేరుతో ఓ నివేదిక తీసుకొచ్చింది. అందులో భారత్‌లో జనాభా పెరుగుదల రేటు 0.4శాతం తగ్గినట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో 137కోట్ల జనాభా ఉండగా.. 2001-11 మధ్యకాలంలో పాపులేషన్ గ్రోత్ రేట్ 1.64శాతంగా నమోదైంది. అయితే 2010-19కి వచ్చేసరికి ఆ పర్సెంటేజీ 0.4శాతం మేర తగ్గింది.

జనాభా పెరుగుదల తగ్గడానికి మహిళల్లో వచ్చిన చైతన్యమే కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. చాలా మంది మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులు పాటిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. అయితే బాల్య వివాహాలు మాత్రం ఏటా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.దశాబ్దకాలంలో భారత్‌లో జననాల రేటు చాలా వరకు తగ్గిందని యూఎన్ రిపోర్టు చెబుతోంది.1991లో వెయ్యికి 30 మంది తగ్గగా ప్రస్తుతం అది 20కి చేరింది. సంతాన సాఫల్య రేటు.. టీఎఫ్ఆర్ కూడా సగానికి తగ్గింది. 1970లో 5గా ఉన్న టీఎఫ్ఆర్ ప్రస్తుతం 2.2కు పరిమితమైంది. సగటు టీఎఫ్ఆర్ రేటు 2.1 కాగా.. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతాన సాఫల్యత రేటు 1.8గా ఉండటం విశేషం. జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెరుగుతుండటం ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *