deepika as arundhati?
అరుంధతి.. అనుష్క కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. అప్పటి వరకూ కేవలం గ్లామర్ డాళ్ గా స్కిన్ షోకే పరిమితమైన అనుష్కలోని నటిని చూపించిన సినిమా ఇది. కోడి రామకృష్ణ అద్భుత దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సోనూసూద్ విలనీ, అతనికి రవి శంకర్ డబ్బింగ్ అంతా కలిసి అరుంధతిని ఆడియన్స్ లో జేజెమ్మగా నిలబెట్టింది. ఇలాంటిది ఒక్క సినిమా చేసినా చాలు అనే భావన ప్రతి హీరోయిన్లోనూ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. చంద్రముఖిని మించిన విజయం సాధించిన అరుంధతి తర్వాత తమిళ్, మళయాలంలో రీమేక్ అయింది. బెంగాలీలో కూడా రీమేక్ చేశారు. అలాంటి సినిమా ఇప్పుడు హిందీలోనూ రీమేక్ కాబోతోంది. తెలుగులో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర హిందీ రీమేక్ రైట్స్ ను అల్లు అరవింద్ తీసుకోవడం విశేషం. ఆయనతో పాటు మరో బాలీవుడ్ నిర్మాత కూడా ఈ ప్రాజెక్ట్ లో కో ప్రొడ్యూస్ గా ఉంటాడు.
నిజానికి హిందీలో కూడా ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తీయాలనుకున్నాడు. అప్పట్లో అనుష్క, రజినీకాంత్(షియాజీ షిండే పాత్ర కోసం) షారుఖ్ ఖాన్(సోనూసూద్ పాత్రలో) లతో రీమేక్ చేయాలనుకున్నాడట. కానీ వాళ్లెవరూ ఒప్పుకోకపోవడం నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పుడు అల్లు అరవింద్ ఆ చిత్రాన్ని హిందీకి తీసుకువెళుతుండటం చూస్తేనే తెలుస్తోంది. ఈ కథలో ఉన్న నావెల్టీ ఏంటనేది. పద్మావత్, భాజీరావు మస్తానీ, తమాషా వంటి సినిమాల్లో దీపిక నటన చూసిన తర్వాత ఈ సినిమాలో అరుంధతిగా ఆమెతోనే నటింప చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీపికా ఇంకా ఓకే చెప్పలేదు. కానీ ఆమెకు కూడా ఈ పాత్రంటే ఇష్టమని గతంలో చెప్పింది. మరోవైపు తనకు హారర్ మూవీలో నటించడం ఇష్టం లేదనేది కూడా ఓ వార్త ఉంది. అయినా అరుంధతి రేంజ్ తెలిసి ఒప్పుకుంటే ఖచ్చితంగా తను బెస్ట్ ఛాయిస్ అవుతుందనుకోవచ్చు. దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ సినిమాకు ఓకే చెప్పి ఉంది. మరి ఈ రీమేక్ కూడా ఒప్పుకుంటే అల్లు అరవింద్ పంట పండినట్టే అనుకోవచ్చు. ఎలాగూ సోనూసూద్ పాత్రను తనే చేస్తాడు.