ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్

2
sharukh with deepika
sharukh with deepika

deepika in prbhas movie

రెబల్ స్టార్ గాతిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు మన బాహుబలి.. ప్రభాస్. బాహుబలి రెండు పార్ట్స్ తో నార్త్ లో అంతులేని అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సాహో మన దగ్గర పెద్దగా మెప్పించకపోయినా.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అది కేవలం అతని ఫ్యాన్స్ వల్లే సాధ్యమైంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’మూవీ చేస్తన్నాడు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా రాబోతోంది. లాక్ డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. అయితే కొన్నాళ్ల క్రితం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కూడా ఓ సోషియో ఫాంటసీ సినిమా అనౌన్స్ అయింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రాబోతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామనే తీసుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే నిర్మాణ సంస్థ ఇవాళ(ఆదివారం) బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ చేసింది.

బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా రాణిస్తోన్న దీపికా పదుకోణ్ ను ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు అఫీషియల్ గా ప్రకటించింది వైజయంతీ మూవీస్ బ్యానర్. దీంతో ఈ ప్రాజెక్ట్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వస్తుందనే చెప్పాలి. మామూలుగా కియారా అద్వానీని తీసుకుంటారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా దీపికాను ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ మిక్స్ అయిన కథ అని అంటున్నారు. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ ఇప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ సిద్ధం చేసుకుంటున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ స్కోప్ ఉన్న ఈ మూవీ కూడా బాహుబలిలా గ్రాఫికల్ వండర్ అనిపించుకుంటుందంటున్నారు. రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ మూవీ 2021 చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

tollywood news