చంద్రబాబు ఇంటిని కూల్చటం ఖాయమన్న బొత్సా

DEMOLITION OF CHANDRABABU HOUSE

మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఇంటిని కూల్చివేస్తామ‌ని ప్ర‌భుత్వం సంచలన ప్రకటన చేసింది . కొద్ది రోజుల క్రితం క‌ర‌క‌ట్ట మీద ఉన్న ప్ర‌జా వేదిక‌ను కూల్చివేసిన ప్ర‌భుత్వం ఆ త‌రువాత అక్క‌డ ఉన్న చంద్ర‌బాబు ఉంటున్న నివాసంతో పాటుగా అన్ని భ‌వ‌నాల‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్య‌వ‌హారం పైన కోర్టులో కేసు కొన‌సాగు తోంది. ఏపీ శాస‌న మండిలిలో చ‌ర్చ సందర్భంగా చంద్ర‌బాబు తాను ఉంటు న్న నివాసాన్ని ఖాళీ చేయ‌టం మంచిద‌ని..లేకుంటే కూల్చ‌టం మాత్రం ఖాయ‌మ‌ని మంత్రి బొత్సా సత్య‌నారాయ‌ణ మండ‌లిలో స్ప‌ష్టం చేసారు.

కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన క‌ర‌క‌ట్ట నిర్మాణాల పైన శాస‌న మండ‌లిలో చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌శ్నో త్త‌రాల స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ఈ అంశం మీద ప్ర‌భుత్వాన్ని నిల‌దీసారు. కక్ష్యతో కరకట్టపై అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారని టీడీపీ సభ్యుల పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కరకట్టపై నిర్మాణలకు ఎందుకు అనుమతు లిచ్చారని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రిని ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలో మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ క‌ర క‌ట్ట మీద మొత్తం 26 అక్ర‌మ నిర్మాణాల‌ను గుర్తించామ‌ని వివ‌రించారు. అదే విధంగా తాము ఎవ‌రితోనూ క‌క్ష్య పూరితం గా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌ని..చ‌ట్టాల‌ను అనుస‌రించే ముందుకు వెళ్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. కూల్చివేత అడ్డుకోవ‌టా నికే హ‌డావుడిగా అర్ద‌రాత్రి కోర్టుకు వెళ్లార‌ని ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నివాసం ఉంటున్న ఇంటి గురించి మంత్రి బొత్సా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. టీడీపీ హ‌యాంలో ప్రజావేదిక నది వెంబడి కట్టకూడదని ఉన్న నిబంధనలన్నింటినీ చంద్రబాబు తుంగలో తొక్కారని బొత్స ఆరోపించారు. ప్రజావేదికకు అనుమతిలిచ్చిన అధికారుల నుంచే రూ.8 కోట్లు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. చం ద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. అక్కడ‌ స్విమ్మింగ్ పూల్, అక్రమ భవనానికి అనుమతులు లేవని లింగమనేని రమేష్‌తో పాటు అద్దెకుంటున్న చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేశామన్నారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు మరోసారి నోటీసులు జారీ చేస్తామన్నారు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయడం మంచిదని.. లేకుం టే చట్టం తన పని తాను చేస్తుందన్నారు. కూల్చడం మాత్రం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశా రు. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌రువాత చంద్ర‌బాబు ఉంటున్న ఇంటి గురించి ప్రభుత్వం ఏ ర‌కంగా ముందుకు వెళ్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

Entertainment News 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *