దోమ కుట్టినా బీమా కవరేజీ

DENGUE INSURANCE SCHEME

దోమకాటు వల్ల మనుషులకు వస్తున్న జబ్బులను కూడా క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమకాటు వల్ల జ్వరంతో బాధపడుతున్న వారందరూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. కొందరికి దోమకాటు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. డెంగ్యూ తో ప్రాణాలు కోల్పోతున్న వారు సైతం రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో దోమ కాటు వల్ల వచ్చే ప్రాణాంతక జ్వరాలకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హెచ్ డి ఎఫ్ సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ లు. ఈ రెండు సంయుక్తంగా దోమకాటుకు ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ను ఉపయోగిస్తున్నారు ఏడాదికి 99 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని వారు ప్రకటిస్తున్నారు.

ఇక ఎయిర్టెల్ తన వినియోగదారుల్లో 40 లక్షల మందికి ఈ పాలసీని అందించనున్నట్లు వెల్లడించింది. వాలెట్ ఇన్సూరెన్స్ పోర్ట్ ఫోలియో లో భాగంగా ఈ పాలసీని అందిస్తున్నామని హెచ్ డి ఎఫ్ సి ఎర్గో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ త్యాగి వివరించారు. ఇక దీని కోసం ప్రత్యేకించి ఎలాంటి పత్రాలు అవసరం లేదని పేర్కొంది. ఇక అలాగే దినసరి కూలీ మీద బతుకు వెళ్లదీసేవారు ప్రాణాంతక జ్వరాలు వస్తే ఆసుపత్రిలో ఫీజులు కట్టలేక పోతున్నారని అందుకే వీరి కోసం ఇలాంటి సదుపాయం అందిస్తున్నామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ సీఈవో అనుబ్రతా విశ్వాస్ తెలిపారు. ఏది ఏమైనా ఇటీవల పెరిగిపోయిన విషజ్వరాలు నేపద్యంలో దోమకాటు వల్ల వచ్చే ఏడు రకాల వ్యాధులకు పరిహారం అందేలా సామాన్యుల కోసం ఈ రెండు సంస్థలు తీసుకున్న నిర్ణయం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

tags : mosquito bite, fevers, malaria, dengue, typhoid , airtel payments bank, hdfc ergo general insurance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *