టీడీపీకి 100 నుంచి 105 సీట్లు.. అధికారం మాదే

Spread the love
Deputy chief chinarajappa

ఏపీ సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీడీపీ విజయానికి కారణమవుతాయని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున టీడీపీకి ఓటేశారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉన్న మాట వాస్తవమే అన్న రాజప్ప.. టీడీపీకి 100 నుంచి 105 సీట్లు వస్తాయని, తామే అధికారంలోకి వస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. కేంద్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ఫ్రంట్ రాబోతోందని రాజప్ప చెప్పారు. కొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మే 23వ తేదీన కౌంటింగ్ జరగనుంది. గెలుపుపై టీడీపీ, వైసీపీ నమ్మకంగా ఉన్నాయి. తామే గెలుస్తామని ఇరు పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు. 100కు పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు. మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మాత్రం.. ఏపీ ప్రజలు సైకిల్ నే కోరుకున్నారని చెప్పారు. ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని, గెలిచే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్పారు. వైసీపీ నేతలు మాత్రం లగడపాటి సర్వేని తప్పుపట్టారు. చంద్రబాబు స్కెచ్ లో భాగమే లగడపాటి సర్వే అన్నారు. వైసీపీకి 120 నుంచి 130 స్థానాలు రావడం ఖాయం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *