డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కు బెయిల్

Dera Baba daughter Got Bail

డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కు నిన్న బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆమెపై ఉన్న దేశద్రోహ ఆరోపణలు కొట్టేసిన పంచకుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.పంచకుల అల్లర్ల కేసులో నిందితురాలిగా ఉన్న హనీ‌ప్రీత్.. విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఆమె అక్టోబర్‌ 2017 నుంచి అంబాలా జైలులో ఉన్నారు. తాజాగా హనీప్రీత్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఆధ్యాత్మిక ముసుగులో ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు రుజువు కావడంతో గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు సీబీఐ కోర్టు అతడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు పంజాబ్‌, హరియాణా  రాష్ట్రాల్లో అల్లర్లకు పాల్పడి అలజడి సృష్టించారు. 2017 ఆగస్టు 25న పంచకుల సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం.. జరిగిన అల్లర్లలో దాదాపు 29 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపుచేయడానికి కేంద్రం ఆర్మీని రంగంలోకి దింపి, పరిస్థితి చక్కదిద్దింది. డేరా బాబా అనుచరులను అరెస్టులు చేశారు. దీంతో ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి హనీప్రీతేనని తేల్చిన పోలీసులు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో 41 మందిని అరెస్టు చేసి అక్టోబర్‌ 2017లో అంబాలా జైలుకు తరలించారు.

ఇక గత రెండేళ్లుగా అంబాలా సెంట్రల్ జైల్లో ఉన్న హనీప్రీత్ విడుదలయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె నిన్న అర్ధరాత్రి నేరుగా సిర్సాలోని డేరాసచ్చాసౌదాకు వచ్చారు. ఈ సందర్భంగా డేరాలో వేచి చూస్తున్న వేలాది మంది భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, ఈ సందర్భంగా ఆమె కోసం వేచి చూస్తున్న మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మీడియాతో మాట్లాడకుండానే రామ్ రహీం నివాసం ఉండే క్వార్టర్ కు కారులో వెళ్లిపోయారు.
tags : dera baba, gurmeeth ram rahim singh, hanipreeth singh, bail, panchakula court

అబ్లుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయంలో సిట్?

రామేశ్వరరావు ఎవరికి ఛాలెంజ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *