దేవా కట్టాకు సాయితేజ్ హ్యాండ్ ఇచ్చాడా..?

5
deva katta movie update
deva katta movie update

deva katta movie update

ప్రతిభావంతమైన దర్శకుడు అని పేరు తెచ్చుకున్నా.. కమర్షియల్ విజయాలు లేక వెనక బడ్డాడు దేవా కట్టా. వెన్నెల సినిమాతో ఆకట్టుకుని.. ప్రస్థానంతో విమర్శకులను మెప్పించిన దేవా కట్టా.. ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. అతను చేసే కథల్లో వైవిధ్యం ఉంటోంది. కానీ కమర్షియల్ గా విజయాలు రావడం లేదు. దీంతో స్టార్ డైరెక్టర్ హోదాలోకి ఎప్పుడో రావాల్సిన వాడు కాస్తా వెనకబడిపోయాడు. తర్వాత చేసిన ఆటోనగర్ సూర్య, డి ఫర్ దోపిడి, డైనమేట్ చిత్రాలేవీ ఆకట్టుకోలేదు. దీంతో దేవా కట్టా రేస్ లో లేకుండా పోయాడు. ఇక లాస్ట్ ఇయర్ తన ప్రస్థానం సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. కథ నచ్చడంతో సినిమాను ఏకంగా సంజయ్ దత్తే నిర్మిస్తూ ప్రదాన పాత్ర చేశాడు. బట్ఆ సినిమా అక్కడ దారుణమైన రిజల్ట్ చూసింది. ఈ నేపథ్యంలో అతను లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథతో అప్రోచ్ అయితే అది కాస్త సాయితేజ్ వద్ద ఆగింది. ఆ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కన్ఫార్మ్ అయింది. కానీ ఇప్పుడు సాయితేజ్ వరస చూస్తోంటే దేవా కట్టాకు హ్యాండ్ ఇచ్చాడా అనేది అర్థమౌతోంది. అటు దేవా కట్టా కూడా మరో సినిమా అనౌన్స్ చేశాడు.

ఒకప్పటి మిత్రులు తర్వాత రాజకీయ శతృవులు అయిన రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు దోస్తానా గురించి అతను కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ‘ఇంద్ర ప్రస్థ’అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీతో దేవా సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ చూపిస్తాడని అంతా అనుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కూడా ఈ మధ్య కాస్త కాంట్రవర్శీ తో కూడిన హడావిడీ నడిచింది. ఈ టైమ్ లో అతను సాయితేజ్ సినిమాను కాదని ఇంద్రప్రస్థను ముందుకు తేవడం వెనక ఏం జరిగిందనేది అర్థం కావడం లేదు. మరోవైపు సాయితేజ్ కూడా దేవా కట్టా సినిమా కంటే ఇతర ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నట్టుగా కనిపిప్తోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తోంటే దేవా తో పాటు సాయితేజ్ కూడా ఒక అండర్ స్టాండింగ్ తోనే తమ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టుకున్నారా లేక వీరి తర్వాతి సినిమాల విషయంలో క్లారిటీగా ఉన్నారా అనేది తేలాల్సి ఉంది.

tollywood news