దేవదాస్ కనకాల ఇకలేరు

Spread the love

DEVADAS KANAKALA NO MORE

ప్రముఖ నటుడు, పలువురు నటులకు శిక్షణ ఇచ్చిన దేవదాస్ కనకాల కన్ను మూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేవదాస్‌ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన నటుడిగా పలు సినిమాల్లో నటించారు. సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్‌ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్‌ తెరపై కనిపించారు. చివరగా భరత్‌ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. ప్రముఖ నటులు రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్‌, భానుచందర్‌, రఘువరన్‌, నాజర్‌, తదితర ఎంతో మందికి శిక్షణ ఇచ్చింది దేవదాసే. ఆయన కుమారుడు రాజీవ్‌ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. 2018లో ఆయన సతీమణి లక్ష్మి మృతిచెందడంతో ఆయన కోలుకోలేకపోయారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన ఆయన.. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కిమ్స్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్టు రాజీవ్‌ కనకాల వెల్లడించారు.

TOLLYWOOD NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *