ధరణి వల్ల జీహెచ్ఎంసీలో దెబ్బ?

DHARANI DELAY BIG IMPACT

ధరణి ఆలస్యమయ్యే కొద్దీ టీఆర్ఎస్ పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దెబ్బ పడనున్నదా? అంటే ఔననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే, దాదాపు రెండు నెలల్నుంచి రియల్ రంగంపై ఆధారపడ్డ వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలీ సమయంలో రిజిస్ట్రేషన్లు బంద్ చేసుకుని ధరణీని అమలు చేయాల్సిన అవసరమేముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా ధరణీని అమలు చేయడం బదులు ఒకేసారి రిజిస్ట్రేషన్లను నిలిపివేయడాన్ని అధిక శాతం మంది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు

పైగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల 23 నుండి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినట్లుగా అధికార యంత్రాంగం కసరత్తులు కూడా చేస్తున్నది. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన పై స్టే విధించింది. ఈ అంశాన్ని ఈ నెల 23న హైకోర్టు మరో సారి విచారించనుంది. హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుండి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్లు మరో మూడు నాలుగు రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

GHMC ELECTIONS UPDATE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *