డైమండ్ మాస్క్ లకు పెరుగుతున్న మార్కెట్

3
Diamond masks
Diamond masks

Diamond masks

ఆకలి మంటలతో మలమలలాడే అనాథలందరూ చావండోయ్.. అంతులేని ఆస్తులున్న సంపన్నులారా ఆనందంలో మునగండోయ్.. అన్నట్టుగా ఉంది నేటి భారతం. కరోనా కారణంగా కోట్లాది జీవితాలు రోడ్డున పడ్డాయి. సాధారణ కూలీల నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి.. చిన్న సన్నకారు పరిశ్రమలున్న వారు సైతం రోజూ చస్తూ బ్రతుకుతున్నారు. అటు ప్రభుత్వాల భరోసా కూడా లేక ఇవాళ బ్రతికితే చాలు అనుకుంటూ కాలం వెల్లదీస్తోన్న తరుణంలో కొందరు సంపన్నులు మాత్రం ఈ బడుగుల బ్రతులను అపహాస్యం చేస్తున్నారా లేక.. తమకేం బాధా లేదు అని చాటుతున్నారా అన్నట్టుగా ‘డైమింగ్ మాస్క్’లను ఆర్డర్ ఇస్తున్నారు. కోవిడ్ -19 గాలిలో కూడా వ్యాప్తిస్తోంది అన్న డబ్ల్యూ హెచ్ వో హెచ్చరికల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని ప్రభుత్వాలను నిబంధనలు విధించాయి. రోజూ కొనేవాడు కొంటున్నాడు. లేదంటే కర్చీఫ్ లు కండువాలు కట్టుకుని జనం అవసరాల మేరకు వీదుల్లో తిరుగుతున్నారు. ఈ టైమ్ లో గుజరాత్ లోని ఓ కొత్త పెళ్లికొడుక్కి సరికొత్త ఐడియా వచ్చింది.

ఎలాగూ భారీ జనం పెళ్లికి రారు కాబట్టి.. ఆ ఖర్చుతో తనకో డైమండ్ మాస్క్ ను చేయించుకున్నాడు. ఈ వార్త కాస్త మీడియాలో రావడంతో ఇక సంపన్నులంతా ఈ వైపుగా ఆలోచిస్తున్నారు. దీంతో గుజరాత్ లోని డైమండ్ వ్యాపారులను ఈ ‘ఆడంబరం’అనుకోకుండా బిజినెస్ ను పెంచింది. దీంతో వారు ఒక్కో డైమింగ్ మాస్క్ ను లక్షన్నర నుంచి ఐదు లక్షల వరకూ వేరియేషన్స్ వేసి విక్రయిస్తున్నారట. ఇక చిన్న చిన్న ఫంక్షన్స్ కు వెళ్లే సంపన్నులు ఇప్పుడు వీటిని ధరించి తమ ఆడంబరాన్ని పదిమందిలో చాటుతున్నారు. దీంతో మరికొందరు కూడా ఈ డైమింగ్ మాస్క్ లకు ఆర్డర్స్ ఇస్తున్నారని.. ఈ ట్రెండ్ తమ వ్యాపారానికి ఊతమిచ్చిందని ఆనందంగా చెబుతున్నారు గుజరాత్ వ్యాపారులు. మొత్తంగా లేనోడిది ఆకలి బాధైతే.. ఉన్నోడిది ఆడంబరాల సంబరం.. ఒకరకంగా ఇది మన భారత్ మోడల్ ను కూడా తెలియజేస్తోందని చెప్పొచ్చు.

viral news